Big Stories

IND W vs ENG W 3rd T20 : 126 పరుగుల లక్ష్యం.. చివరి వరకు పోరాటం. .

cricket news today telugu

IND W vs ENG W 3rd T20(Cricket news today telugu) :

- Advertisement -

స్వల్ప లక్ష్యమే అయినా భారత అమ్మాయిలు 19 ఓవర్ వరకు లాగించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 126 పరుగుల తక్కువ లక్ష్యాన్ని కూడా పడుతూ లేస్తూ 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఏదేమైనా మూడు టీ 20 మ్యాచ్ లను పరిశీలిస్తే, టీ 20 వుమెన్స్ క్రికెట్ లో బ్యాటింగ్ ఆర్డర్ ని పరిపుష్టం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇంగ్లాండ్ తో స్వదేశంలో జరుగుతున్న ఉమెన్స్ టీ 20 మూడు మ్యాచ్ ల సిరీస్ లో రెండు ఓడి, సిరీస్ కోల్పోయిన టీమ్ ఇండియా, మూడో మ్యాచ్ లో గెలిచి పరువు కాపాడుకుంది. టీమ్ఇండియా ఫీల్డింగ్ లో మాత్రం ఎక్సాటార్డనరీ పెర్ ఫార్మెన్స్ అని చెప్పాలి.

ఏ ఒక్క క్యాచ్ ను కూడా మిస్ చేయలేదు. అలాగే అద్భుతమైన డ్రైవ్స్ తో పట్టిన క్యాచ్ లు చూసి, మన టీమ్ ఇండియా మెన్స్ టీమ్ స్ఫూర్తి పొందాలి. బ్యాటింగ్ లో సెంచరీ చేయడం, బౌలింగ్ లో వికెట్ తీయడం ఎంత గొప్పో, ఒక ఫీల్డర్ క్యాచ్ వీటన్నింటికన్నా గొప్పది. టీ 20 మ్యాచ్ లో రెండు జట్లు కలిపి చేసే 500 పరుగులకన్నా 20 వికెట్లు చాలా గొప్పవి. ఆ పని టీమ్ ఇండియా అమ్మాయిలు చేసి నిజమనిపించారు.

మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఆల్రడీ సిరీస్ గెలిచామన్న అత్యుత్సాహం వారిలో కనిపించింది. కొంచెం నిర్లక్ష్యంగానే షాట్లు కొట్టారు. త్వరత్వరగా అవుట్ అయిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హీథర్ నైట్ చివరి రెండు ఓవర్లలో బ్యాట్ ఝులిపించింది. 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52 పరుగులు చేసి అవుట్ అయ్యింది. అమీ జోన్స్ (25) ఆమెకు అండగా నిలిచింది. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో  శ్రేయాంక పాటిల్ 3 ,సైకా ఇషాక్ 3, అమన్‌జో కౌర్ 2, రేణుక సింగ్ 2 వికెట్లు పడగొట్టారు.

అనంతరం లక్ష్య చేధనలో అమ్మాయిలు పడుతూ లేస్తూ విజయం సాధించారు. చివరకు 19 ఓవర్ల వరకు తీసుకెళ్లి, ఒక ఓవర్ ఉందనగా 5 వికెట్లు కోల్పోయి విజయం సాధించారు. అయితే మొదటి రెండు టీ 20లు సరిగా ఆడలేకపోయిన స్మృతి మంధాన ఈ మ్యాచ్ లో విజృంభించింది. ( 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకుంది. జెమీమా రోడ్రిగ్స్  4 ఫోర్లతో 29 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది.

చివర రెండు ఓవర్లలో హైడ్రామా నడిచింది. 12 బాల్స్ కి 11 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటికి నాలుగు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియాలో టెన్షన్ మొదలైంది.సోఫీ ఎక్లెస్టోన్ బౌలింగ్ కి వచ్చింది. మొదటి బాల్ కి రిచా ఘోష్ బౌల్డ్.. ముంబయిలో వాంఖేడి స్టేడియం అంతా కిక్కిరిసి పోయి ఉంది. ఊపిరి బిగబట్టి చూస్తున్న వాళ్లంతా ఒక్కసారి స్టన్ అయిపోయారు. దాంతో 11 బాల్స్ 11 పరుగులకి టార్గెట్ పడిపోయింది.

అప్పుడొచ్చింది అమంజోత్ కౌర్. వచ్చీ రాగానే ఓవర్ రెండో బాల్ ని ఒక్క ఫోర్ కొట్టింది. అంతే స్టేడియం అంతా హమ్మయ్యా అని మళ్లీ గాలి పీల్చుకున్నారు. తర్వాత బాల్ సింగిల్ తీసి, కెప్టెన్ కి హర్మన్ ప్రీత్ కి ఇచ్చింది. అప్పటికే కాలి కండరం పట్టేయడంతో అర్థాంతరంగా మైదానం వీడిన కెప్టెన్ తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాటింగ్ కి వచ్చి, టెన్షన్ పడకుండా సింగిల్ తీసి తెలివిగా అమంజోత్ కి ఇచ్చింది.

తను మళ్లీ ఒక ఫోర్ కొట్టింది. చివరికి ఆ ఓవర్ లో  1 బాల్, 1 పరుగు చేయాలి. చివర్లో బైస్ రూపంలో నాలుగు పరుగులు వచ్చాయి. అలా ఒకే ఓవర్ లో 14 పరుగులు వచ్చాయి. మొత్తానికి అలా చచ్చీ చెడి గెలిచి, సిరీస్ క్లీన్ స్వీప్ కాకుండా టీమ్ ఇండియా పరువు దక్కించుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెయ కెంప్ 2, సోఫీ ఎక్లెస్టోన్ 2, చార్లీ డెన్ ఒక వికెట్ తీశారు. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News