BigTV English

Ranbir Kapoor: రణబీర్ చేతిలో ఎన్ని పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయంటే..?

Ranbir Kapoor: రణబీర్ చేతిలో ఎన్ని పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయంటే..?

Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. రొమాంటిక్, యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలతో ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంది. బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.900 కోట్ల వసూళ్లు సాధించి అబ్బురపరచింది. ఈ సినిమాతో రణబీర్ కెరీర్ ఇప్పుడు పీక్స్‌లో ఉందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న రణబీర్.. తన తదుపరి ప్రాజెక్ట్‌లపై ఫోకస్ పెట్టాడు. ఇందులో భాగంగా ఈ హీరో చేయబోతున్న నెక్స్ట్ సినిమాలన్నీ భారీ బడ్జెట్‌ పాన్ ఇండియా సినిమాలే కావడం గమనార్హం.


రణబీర్ తదుపరి లైనప్ చూసుకుంటే.. నితీష్ తివారి దర్శకత్వంలో ‘రామాయణం’ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో అతడు రాముడుగా నటిస్తున్నట్లు సమాచారం. అలాగే సీతాదేవి పాత్రలో సాయి పల్లవి.. రావణాసురుడి పాత్రలో రాఖీ భాయ్ యష్ నటించబోతున్నట్లు సమాచారం. దీంతోపాటు రణబీర్ మరో స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీతో మరో కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్‌ను తాజాగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ లైనప్‌తో పాటు రణబీర్ ఖాతాలో మరో మూడు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.

‘యానిమల్’ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ మూవీకి సీక్వెల్‌గా ‘యానిమల్ పార్క్’ని తెరకెక్కించనున్నారు. అలాగే మరో పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మస్త్ర’ సీక్వెల్. ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. అలాగే రణబీర్ ఖాతాలో రాజ్ కుమార్ హిరానీతో చేయాల్సిన మరో భారీ ప్రాజెక్ట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి చూసుకుంటే ఈ హీరో చేతిలో చాలా సినిమాలు ఉండటం విశేషం.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×