E-Paper
Advertisement

RAPO 22 Shooting Update : జోరుమీదున్నరామ్ పోతినేని… అప్పుడే పూర్తి చేశారు..

RAPO 22 Shooting Update : జోరుమీదున్నరామ్ పోతినేని… అప్పుడే పూర్తి చేశారు..
Advertisement

RAPO 22 Shooting Update : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో రామ్ పోతినేని ఒకరు. దేవదాస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. నేను విభిన్నమైన సినిమాలను చూస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక రీసెంట్ టైమ్స్ లో రామ్ పోతినేని హిట్ సినిమా చూసి చాలా రోజులు అయింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత రామ్ కెరియర్ లో ఇప్పటివరకు హిట్ సినిమా రాలేదు. కేవలం రామ కెరియర్ లో మాత్రమే కాకుండా పూరి జగన్నాథ్ కెరీర్లు కూడా హిట్ సినిమా పడలేదు. ప్రస్తుతం రామ్ పోతినేని కథానాయకుడిగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమాను నిర్మిస్తోంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ విజయం తర్వాత యంగ్ అండ్ టాలెంటెడ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

రామ్ కెరియర్ లో వస్తున్న 22 సినిమా ఇది. అందుకని #RAPO22ను వర్కింగ్ టైటిల్‌గా వ్యవహరిస్తున్నారు. రాజమండ్రిలో సెకండ్ షెడ్యూల్ ముగించుకుని చిత్ర బృందం హైదరాబాద్ వచ్చింది. రాజమండ్రిలో 34 రోజుల పాటు నాన్‌ స్టాప్‌గా డే అండ్ నైట్ షూటింగ్ చేసింది RAPO22 యూనిట్. ఈ షెడ్యూల్‌లో రెండు పాటలతో పాటు ఒక యాక్షన్ సీక్వెన్స్, ఇంకా ఇంపార్టెంట్ టాకీ సీన్స్ షూటింగ్ చేశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో అందమైన లొకేషన్లను అంతే అందంగా క్యాప్చర్ చేశామని చిత్ర బృందం చెబుతోంది.రాజమండ్రిలో జరిగిన చిత్రీకరణలో హీరో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే సహా రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ పాల్గొన్నారు. మార్చి 28వ తేదీ నుంచి హైదరాబాద్ షెడ్యూల్ మొదలవుతుందని నిర్మాతలు తెలిపారు.

Advertisement

Also Read: Kiss Song : ఒక్క ముద్దు కోసం ఇన్ని కష్టాలా? ఎక్కడో ఒక చోట పెట్టేయ్ సిద్ధూ..

రారా కృష్ణయ్య సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు మహేష్ బాబు. ఈ సినిమా ఊహించని స్థాయిలో ఆడకపోయిన మంచి పేరును మాత్రం తీసుకొచ్చింది. నవీన్ పోలిశెట్టి హీరోగా చేసిన మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా మంచి హిట్గా నిలిచింది. ఆ దర్శకుడు నుంచి వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే ఈ సినిమా నుంచి రామ్ లుక్స్ ను విడుదల చేశారు. రామ్ లవర్ బాయ్ క్యారెక్టర్ లో ఈ సినిమాలో కనిపించనున్నాడు అని విడుదలైన లుక్స్ చూస్తుంటే అర్థమవుతుంది. అలానే రామ్ పొతినేని లవ్ స్టోరీ సినిమా చేసి కూడా చాలా రోజులైంది. ఈ సినిమాతో ఏ స్థాయి సక్సెస్ అందుకుంటాడు వేచి చూడాలి.

Advertisement

Also Read: Murugadoss: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నుంచి మరో స్పైడర్ సినిమా?

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×