BigTV English

Empuraan: బాక్సాఫీస్ పై వార్ అనౌన్స్ చేసిన స్టీఫెన్ నిడుంపల్లి అకా అబ్రామ్ ఖురేషి

Empuraan: బాక్సాఫీస్ పై వార్ అనౌన్స్ చేసిన స్టీఫెన్ నిడుంపల్లి  అకా  అబ్రామ్ ఖురేషి

Empuraan: 2019లో వచ్చిన “లూసిఫర్” సినిమా మలయాళ సినీ ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. మోహన్‌లాల్ కెరీర్‌లోనే కాక, మొత్తం మలయాళ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న “L2E: ఎంపురాన్” ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. లూసిఫర్ స్టోరీలో కొత్త ట్విస్టులు, మరింత పొలిటికల్ డ్రామా, హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో ఈ సీక్వెల్ భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది. ట్రైలర్ చూసిన తర్వాత ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది – ఈసారి స్కేల్ మరింత పెద్దది.


మోహన్‌లాల్ ఈసారి ఖురేషి-అబ్రామ్ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లిగా మరింత పవర్‌ఫుల్ యాంగిల్‌లో కనిపిస్తున్నారు. ట్రైలర్‌లో ఆయన ఇంటెన్స్ లుక్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా, స్టీఫెన్ నిడుంపల్లి క్యారెక్టర్ లో మోహన్‌లాల్ పవర్ ఫుల్ గా కనిపిస్తే, అబ్రామ్ ఖురేషి పాత్రలో డెవిల్ లా ఉన్నాడు. ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య మోహన్ లాల్ మంచి వేరియేషన్ చూపించి ఇంపాక్ట్ పెంచాడు.

పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమా డైరెక్టర్ మాత్రమే కాకుండా ఇందులో కీలక పాత్రలో కూడా కనిపించబోతున్నారు. ట్రైలర్‌లో కనిపించిన విజువల్స్ రిచ్‌గా, గ్రాండ్‌గా ఉన్నాయి. హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఉండే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకి మరింత హైప్ తీసుకురావడం ఖాయం. మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్ ఇందులో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.


ఒవరాల్‌గా “L2E: ఎంపురాన్” ట్రైలర్ లూసిఫర్ ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. మొదటి భాగం కన్నా ఇది మరింత ఇంటెన్స్, మరింత పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతుందనే ఫీలింగ్ కలిగించింది. సినిమాటోగ్రఫీ, బీజీఎమ్, విజువల్స్ అన్నీ కూడా టాప్ నాచ్‌గా ఉన్నాయి. పాన్-ఇండియా లెవెల్‌లో కాకుండా, ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఈ సినిమాను ప్రెజెంట్ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ ముందుకు వెళ్లినట్టు స్పష్టంగా తెలుస్తోంది.

ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో మార్చి 27న రిలీజ్ అవుతోంది. ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో విడుదల అవ్వడం కూడా ఈ సినిమాకి మరో హైలైట్. లూసిఫర్ ఫస్ట్ పార్ట్ హిట్ అయ్యాక, అందరూ రెండో పార్ట్‌పై బిగ్గెస్ట్ అంచనాలు పెట్టుకున్నారు. ఈ ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచడమే కాకుండా, మరో మాస్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ వచ్చి పెద్ద దుమ్ము లేపుతుందనే సంకేతాలు ఇచ్చింది. మరి లూసిఫర్ సినిమా తెలుగులో రిలీజ్ అయ్యాక కూడా ఇక్కడ రీమేక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఎంపురాన్ సినిమాని కూడా తెలుగులో చేయడానికి రెడీ అవుతాడా లేక పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది కాబట్టి వదిలేస్తాడా అనేది చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×