Speaker Ayyanna Angry: వైసీపీ రూటు మార్చింది. సభ్యత్వం కోల్పోకుండా ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తున్నారు. చివరకు ఎవరికీ కనిపించకుండా సైడ్ అయిపోతున్నారు? సభ మొదలై నుంచి ఇదే విధంగా చేయడంతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించారని, దొంగలా మాదిరిగా అలా చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇంతకీ ఏం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
అసలేం జరిగింది?
ఏపీలో ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు అధికార టీడీపీ, జనసేన, బీజేపీ సభ్యులతోపాటు విపక్ష వైసీపీ సభ్యులు సభకు హాజరయ్యారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా సభ్యులు చేయాల్సిన రగడ చేశారు.. ఆ తర్వాత వెళ్లిపోయారు. అదేరోజు సాయంత్రం తాము అసెంబ్లీ సమావేశాలను హాజరుకాబోమంటూ ప్రకటన చేశారు మాజీ సీఎం జగన్.
సభ్యత్వం కోల్పోకుండా ఉండేందుకు సభకు సభ్యులు వచ్చారంటూ అధికార పార్టీ నుంచి కౌంటర్లు పడిపోయాయి. అయితే గవర్నర్ ప్రసంగం రోజు లెక్కలోకి కాదని అసెంబ్లీ అధికారులు తెలిపారు. బీఏసీ సమావేశంలో తర్వాత నుంచి సభ్యులు హాజరు వర్తిస్తుందని చెప్పడంతో కొంతమంది వైసీపీ సభ్యులు షాకయ్యారు. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు.. చేస్తున్నారు కూడా.
వైసీపీ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం వెనుక
ఇక అసలు విషయానికి వద్దాం. అసెంబ్లీలో వైసీపీ సభ్యులు చేసిన వ్యవహారాలను బయటపెట్టారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. సమావేశాలు ప్రారంభం నుంచి ఇప్పటివరకు వైసీపీ సభ్యులు 25 ప్రశ్నలకు వేశారన్నారు. వాటికి సమాధానాలు లభించలేదు. విపక్ష సభ్యులు తమ ప్రశ్నలు ఇస్తున్నారని, అయినా సభకు రావడం లేదన్నారు. సభ్యులు ఇలా చేయడం సరికాదన్నారు.
ALSO READ: ఫ్రీ బస్సుపై వైసీపీ మహిళలు మాస్ ర్యాగింగ్
ఆ సబ్జెక్టుపై మిగతా సభ్యులు మాట్లాడే అవకాశాన్ని కోల్పోతున్నారని అన్నారు స్పీకర్. ప్రజాస్వామ్యంలో ఇది కరెక్టు కాదు, చాలా దురదృష్టకరమన్నారు. ఎన్నికైన సభ్యులు సభకు రావాలని, ఎవరికీ కనిపించకుండా వచ్చి హాజరు పట్టికలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారు. ప్రజలు ఎన్నుకున్న మీరు.. దొంగలాగా వచ్చి సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.
ఆయా సభ్యులు ఇలా చేయడం వల్ల గౌరవం తగ్గుతుందే తప్ప పెరగదని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు సభాపతి అయ్యన్నపాత్రుడు. అలా వచ్చిన వారిలో వై.బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధ, అమరనాథ్ రెడ్డి, విశ్వేశ్వరరాజు ఉన్నారని తెలిపారు.
గవర్నర్ ప్రసంగం తరువాత మిగతా రోజుల్లో ఆయా నేతలు రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్లినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు స్పీకర్. కానీ వారెవరూ సభలో కనిపించలేదన్నారు. ఇది ఎంతవరకు సమంజసం ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. ప్రజలకు మనం ఆదర్శంగా నిలవాలి తప్ప, వారికి తలవొంపులు తెచ్చేలా ఉండకూడదన్నారు. జరుగుతున్న విషయాలను సభ ముందు పెట్టాలని భావించి బయట పెట్టానన్నారు స్పీకర్.
మొత్తానికి గవర్నర్ ప్రసంగం రోజును లెక్కలోకి తీసుకోమని అసెంబ్లీ అధికారులు చెప్పడమే దీనికి కారణంగా తెలుస్తోంది. అందువల్ల మరసటి రోజు వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వచ్చి అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారు. మొత్తానికి సభలో అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు సభ్యులు జాగ్రత్త పడ్డారనే చెప్పవచ్చు.
ఏపి అసెంబ్లీలో సభ్యుల హజరుపై కీలక ప్రకటన చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
సభ్యులు ఎవరికీ కనిపించకుండా దొంగల్లా వచ్చి సంతకాలు పెట్టి వెళ్లిపోతున్నారు
వై.బాలనాగిరెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, రేగం మత్స్యలింగం, విరూపాక్షి, దాసరి సుధ, అమరనాథ్ రెడ్డి, విశ్వేశర రాజులు ఇలా సంతకాలు చేసి… pic.twitter.com/7NVlEpzM7n
— BIG TV Breaking News (@bigtvtelugu) March 20, 2025