BigTV English

Rashmika : అనిమల్ మూవీ సెట్‌లో ఏడ్చిన రష్మిక

Rashmika : అనిమల్ మూవీ సెట్‌లో ఏడ్చిన రష్మిక

Rashmika : సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన అనిమల్ సినిమా ఇంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందీప్ చేసిన కబీర్ సింగ్ రిలీజ్ అయినప్పుడు చాలామంది బాలీవుడ్ రివ్యూ రైటర్స్ ఇది ఒక వైలెంట్ ఫిలిం అని రాసుకొచ్చారు. రేటింగ్స్ కూడా చాలా తక్కువగా ఇచ్చారు. అయితే ఈ సినిమా కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తరుణంలో సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ చాలామంది రివ్యూ రైటర్స్ నా సినిమాను రివ్యూ చేశారు దానిని ఒక వైలెంట్ ఫిలిం అన్నారు. కేవలం రెండు మాత్రమే రేటింగ్ ఇచ్చారు కానీ ఆడియన్స్ 250 కోట్లు ఇచ్చారు అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా నా సినిమాని వైలెంట్ ఫిలిం అన్నారు కదా, అసలైన వైలెంట్ ఫిలిం అంటే ఏంటో నేను చూపిస్తాను అంటూ ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డివంగా చెప్పుకొచ్చాడు.


రన్బీర్ కపూర్ హీరోగా అనిమల్ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. చాలామంది రివ్యూ వర్స్ కి గట్టిగా సమాధానం చెప్పాడు సందీప్ రెడ్డి వంగ. సినిమాలో వచ్చే ఒక సీన్ కూడా ప్రత్యేకించి వాళ్ళ కోసమే తీశాడు అని ఒక వాదన కూడా ఉంది. సినిమా మీద నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమాను విపరీతంగా ఇష్టపడిన డైరెక్టర్స్ కూడా ఉన్నారు. ఇకపోతే అనిమల్ సినిమా సెట్ లో జరిగిన ఒక సంఘటన గురించి ఒక ఇంటర్వ్యూలో రష్మిక చెప్పుకొచ్చారు.

అనిమల్ సినిమా చేస్తున్న తరుణంలో బ్రేక్ ఫాస్ట్ చాలా బోరింగ్ గా ఉండేదట. అది అప్పట్లో రష్మిక కంప్లైంట్ కూడా చేసిందంట. ఆ తర్వాత రోజు రన్బీర్ కపూర్ స్వయంగా రష్మిక కోసం తన చెఫ్ ను పెట్టి వంట చేయించి రష్మికకు పెట్టారట. అయితే రష్మిక కు ఆ ఫుడ్ చాలా విపరీతంగా నచ్చింది. ఇంత బాగా ఎలా చేయించగలిగారు అని ఆశ్చర్యపడింది. అంతేకాకుండా మీరు ఈ బోరింగ్ ఫుడ్ ఎలా తింటున్నారు ఇంత మంచి చెఫ్ ని ఉంచుకొని అంటూ అడిగిందట రష్మిక. రన్బీర్ కపూర్ తనకోసం బ్రేక్ఫాస్ట్ చేయిస్తే ఎమోషనల్ అయిపోయి ఏడ్చాను అంటూ చెప్పుకొచ్చింది.రష్మిక ఎన్ని సినిమాలు చేసినా కూడా అనిమల్ సినిమా ప్రత్యేకమని చెప్పాలి. గీతాంజలి అనే పాత్రలో రష్మిక ఒదిగిపోయిన తీరు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంత మంచి పర్ఫార్మర్ రష్మిక లో ఉంది అని ప్రూవ్ చేసిన సినిమా అనిమల్. రష్మిక కంటే ముందు ఈ సినిమా కోసం శ్రద్ధ కపూర్ ని సంప్రదించాడు సందీప్ రెడ్డి వంగ. ఒక పది రోజులు షూటింగ్ చేసిన తర్వాత గీతాంజలి పాత్రకి మీరు సెట్ అవ్వట్లేదు అని చెప్తే, ఆవిడ కూడా అర్థం చేసుకొని ఆ సినిమా నుంచి తొలగిపోయింది అంటూ సందీప్ ఇదివరకే ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.


Also Read : Akira Nandan: ఆశ్చర్యం.. ఒక వారసుడి దర్శకత్వంలో మరో వారసుడు ఎంట్రీ.. పూర్తి వివరాలివే..!

Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×