Vizag Crime News: విశాఖలో దారుణం చోటుచేసుకుంది. తన భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని ఓ గురూజీని అతి కిరాతంగా చంపాడు భర్త చిన్నారావు. తన పట్ల ఎవరూ లేని సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడని భార్య మౌనిక చెప్పడంతో.. చిన్నారావు అతి కిరాతకంగా ఆ పూజారిని కొట్టి చంపిన ఘటన భీమిలిలో చోటుచేసుకుంది. అయితే ఈనెల 7న పూజల కోసం జ్యోతిష్యుడు అప్పన్నను ఇంటికి పిలిపించింది భార్య మౌనిక. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోడంతో జ్యోతిష్యుడు అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని భర్త చిన్నారావుకు మౌనికి చెప్పింది. తన తల్లికి ఆరోగ్యం బాగోలేదు.. పూజలు చేయడానికి రావాలని చిన్నారావు ఆ జ్యోతిష్యుడని పిలిచి అతి కిరాతంగా హత్య చేసినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో విశాఖ ఆనందపురం హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. లైంగిక వేధింపులే హత్యకు కారణంగా తేల్చారు. ఈ కేసులో భార్యాభర్తలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జ్యోతిష్య వృత్తిలో ఉన్న అప్పన్నను భార్యాభర్తలు చంపారు. చిన్నారావు భార్య మౌనికతో అప్పన్న అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న చిన్నారావు అప్పన్నను చాకుతో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత 2 లీటర్ల డీజిల్, 2 లీడర్ల పెట్రోల్ తెచ్చి మృతదేహాన్ని భార్యాభర్తలు కలిసి కాల్చేశారు.
ఈ నెల 9వ తేదీ నుంచి మోతి అప్పన్న మిస్ అయ్యాడు. ఆనందపురం పీఎస్‌లో కేసు నమోదు అయింది. అస్థిపంజరం వద్ద పూసలు ఉండటంతో అది తన తండ్రిదే అని కుమారుడు దుర్గాప్రసాద్ గుర్తించాడు. ఘటనా స్థలంలో ఉన్న పూసలు, రక్త నమూనాలను సేకరించారు పోలీసులు.
ఇదిలా ఉంటే.. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రూరల్ బంగారమ్మపేటలో దారుణం జరిగింది. భార్య కృష్ణతులసి, మామ నాగయ్యపై.. మురళీకృష్ణ అనే వ్యక్తి దాడి చేశాడు. కొబ్బరి బొండాల కత్తితో.. విచక్షణారహితంగా నరికాడు. నాలుగేళ్ల క్రితం మురళీకృష్ణతో కృష్ణతులసీకి రెండో వివాహం జరిగింది. నాలుగు నెలల క్రితం భర్తతో గొడవపడిన తులసి.. తండ్రి నాగయ్య ఇంటి వద్ద ఉంటోంది. నాగయ్య వద్ద 50 వేలను మురళీకృష్ణ అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించాలని అల్లుడిని అడిగినందుకే.. తులసి, నాగయ్యపై కొబ్బరి బొండాల కత్తితో దాడి చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనాస్థలిలోనే కృష్ణ తులసి మృతి చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగయ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మురళీకృష్ణ పరారీలో ఉన్నాడు.
Also Read: వరంగల్‌లో దారుణం.. నడి రోడ్డుపై డాక్టర్‌ను ఇనుపరాడ్లతో కొట్టి.. ఆపై హత్యాయత్నం
మరోవైపు తెలుగురాష్ట్రాల్లో ఒకేతరహాలో రెండు ఘటనలు జరిగాయి. డబ్బులు కారణంగా అత్తా, మామయ్యలపై.. అల్లుళ్లు దాడికి పాల్పడిన ఘటనలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా బంగారమ్మపేటలో దారుణం జరిగింది. తమ నుంచి అప్పుగా తీసుకున్న 50 వేల రూపాయలు తిరిగి అడిగినందుకు.. భార్య, మామపై.. అల్లుడు కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఘటనలో భార్య కృష్ణతులసి అక్కడికక్కడే మృతి చెందగా.. మామ నాగయ్యకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిందితుడు మురళీకృష్ణ పరారీలో ఉన్నాడు.
మరోవైపు.. వరంగల్ నగరంలోని వాసవి కాలనీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. భార్య పల్లవిపై.. భర్త చంద్రశేఖర్ కత్తితో దాడి చేశాడు. అడ్డొచ్చిన అత్తామామను మటన్ కత్తితో నరికాడు. ముగ్గురిపై చంద్రశేఖర్ దాడి చేశాడు. క్షతగాత్రులను స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.