Akira Nandan:చాలా రోజుల నుండి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తనయుడు అకీరా నందన్ (Akira Nandan) సినీ ఎంట్రీ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి పాపులర్ అయ్యారో అప్పటి నుండి పవన్ కళ్యాణ్ తన కొడుకు అకీరానందన్ ని వెంటబెట్టుకొని తిరుగుతున్నారు. ఎక్కడికి వెళ్లినా కూడా అకీరానందన్ ని వదలకుండా తనతో పాటే తీసుకువెళ్తున్నారు.ఈ నేపథ్యంలోనే అకీరానందన్ ని ఫేమస్ చేయడం కోసమే పవన్ తన వెంటబెట్టుకొని తిరుగుతున్నాడనే రూమర్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తాను సైన్ చేసిన 3 సినిమాలు పూర్తి చేసి,ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేస్తారని, తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితమై.. తన కొడుకు అకీరా నందన్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు అనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో.. చాలా రోజుల నుండి అకీరా నందన్ సినీ ఎంట్రీ పై వార్తలు వినిపిస్తున్న కారణంగా.. ఎట్టకేలకు అకీరా నందన్(Akira Nandan) సినీ ఎంట్రీ పై ఒక గుడ్ న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే అకీరానందన్ ఆ డైరెక్టర్ కుమారుడి దర్శకత్వంలో తన ఫస్ట్ మూవీ చేయబోతున్నారట. మరి ఇంతకీ అకీరానందన్ ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
Tollywood: జాక్ పాట్ కొట్టిన రష్మిక.. ఏకంగా గ్లోబల్ స్టార్ మూవీలో అవకాశం..!
సందీప్ దగ్గర డైరెక్షన్లో మెలుకువలు నేర్చుకుంటున్న రిషి మనోజ్..
అకీరా నందన్ సినీ ఎంట్రీ మరో 2 సంవత్సరాల్లో ఉండబోతున్నట్టు ఇండస్ట్రీ వర్గాల నుండి ఓ టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అకీరా నందన్ ఫస్ట్ మూవీ త్రివిక్రమ్(Trivikram) కొడుకు రిషి మనోజ్ (Rishi Manoj) దర్శకత్వంలో ఉండబోతున్నట్టు టాలీవుడ్ సినీ వర్గాల్లో ఓ టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. అయితే త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ ఇప్పటికే తండ్రి దగ్గర డైరెక్షన్ ఎలా చేయాలో నేర్చుకున్నారట. అయితే తాజాగా తన కొడుకుని సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy vanga) దగ్గర మరింత వర్క్ నేర్చుకోవాలని ఆయన దగ్గరికి పంపించినట్లు తెలుస్తోంది. అలాగే సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ (Prabhas) తో చేయబోయే స్పిరిట్ (Spirit) మూవీకి రిషి మనోజ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నట్టు రూమర్స్ కూడావినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్ కొడుకు రిషి మనోజ్ డైరెక్టర్ గా పూర్తి వర్క్ నేర్చుకున్న వెంటనే తన ఫస్ట్ మూవీ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరానందన్ తో తీయబోతున్నట్లు తెలుస్తోంది.అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన కొడుకు మొదటి సినిమా కోసం కథ కూడా రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
రిషి మనోజ్ డైరెక్షన్లో అకీరా ఫస్ట్ మూవీ..
దీంతో ఈ రూమర్లు నెట్టింట్లో వైరల్ అవ్వడంతో త్రివిక్రమ్ కొడుకు సినిమాతో పవన్ కొడుకు సినీ ఎంట్రీ ఊహించుకుంటేనే కాంబో వేరే లెవెల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. ఎందుకంటే పవన్ – త్రివిక్రమ్ బాండింగ్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ ప్రాణ స్నేహితులని చెప్పుకోవచ్చు.వీరి కాంబోలో వచ్చిన సినిమాలు హిట్ అయినా.. ఫ్లాప్ అయినా అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే పొందుతాయి. అలాంటి మంచి బాండింగ్ ఉన్న త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ల తనయుల కలయికలో కూడా సినిమా వస్తుంది అంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ లో మరిన్ని అంచనాలు పెరిగి పోయాయి. ఇక అకీరా నందన్ తన ఫస్ట్ మూవీలో చాలా వైల్డ్ లుక్ లో కనిపిస్తారని, అలాంటి వైల్డ్ లుక్ మూవీ కావాలంటే ఖచ్చితంగా సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దగ్గర వర్క్ నేర్చుకోవాల్సిందేనని రిషి మనోజ్ ఆ డైరెక్టర్ దగ్గర వర్క్ నేర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి రిషి మనోజ్ , అకీరా నందన్ ల ఫస్ట్ మూవీ ఎంట్రీ ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.