Rashmika mandanna:ప్రముఖ కన్నడ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika mandanna) ‘కిరిక్ పార్టీ’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. అక్కడ భారీ పాపులారిటీ అందుకొని తెలుగులోకి ‘ఛలో’ సినిమా ద్వారా అడుగు పెట్టింది.ఇక్కడ కూడా తన నటన, అందాలతో అందరిని ఆకట్టుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘గీతాగోవిందం’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఈ సినిమాలో ఈమెకు జోడీ గా నటించిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay deverakonda) తో కాస్త చనువుగా మూవ్ అయింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే ఇద్దరు కలిసి వెకేషన్స్ కి వెళ్లడం, పలు ప్రదేశాలలో తిరుగుతూ మీడియా కంట పడడంతో, ఇద్దరి మధ్య ఏదో ఉందనే రూమర్లు గట్టిగా వినిపించాయి. దీనికి తోడు పలు సందర్భాలలో అటు రష్మిక, ఇటు విజయ్ దేవరకొండ ఇద్దరూ కూడా ఇండైరెక్టుగా హింట్ ఇచ్చారు.
జీవిత భాగస్వామిగా ఉంటేనే ఆనందం..
విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగే ఏ ఫంక్షన్ కైనా సరే రష్మిక ముందుంటుంది. అటు విజయ్ దేవరకొండ తమ్ముడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand deverakonda) తో కూడా “నువ్వు నా మరిది” అంటూ పబ్లిక్ ఈవెంట్లో సంబోధించడంతో అనుమానాలు కాస్తా మరింత బలపడ్డాయి. దీంతో వివాహం చేసుకుంటారు అని అందరూ అనుకుంటుండగా.. ఇప్పుడు అనూహ్యంగా ” జీవిత భాగస్వామిగా ఉండడం అంటే తనకు ఇష్టం” అంటూ తెలిపి అందరినీ ఆశ్చర్యపరిచింది రష్మిక మందన్న. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఎట్టకేలకు ఓపెన్ అయిన రష్మిక..
గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన చిత్రం ‘పుష్ప 2’. భారీ అంచనాల మధ్య వచ్చి, అత్యధిక కలెక్షన్లు సాధించి, సరికొత్త రికార్డు సృష్టించింది. దీంతో రష్మికకి పాన్ ఇండియా గుర్తింపు లభించింది. ఆ క్రేజ్ తోనే బాలీవుడ్ లో విక్కీ కౌశల్(Vicky koushal) హీరోగా లక్ష్మణ్ ఉటేకర్(Lakshman utkar) దర్శకత్వంలో వస్తున్న ‘ఛావా’ (Chhaava) అనే సినిమాలో నటిస్తోంది. ‘శంభాజీ శివాజీ మహారాజ్’ జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో శంభాజీ శివాజీ మహారాజ్ భార్య పాత్ర పోషిస్తోంది రష్మిక. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కూడా ఘనంగా జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఈమె తనకు ఆనందం ఎక్కడ లభిస్తుందో తెలిపింది. ఛావా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన రష్మిక..” నాకు డబ్బు, పరపతి, కీర్తి, ప్రతిష్టలతో సంతోషం కలగడం లేదు. అందరిలాగే నేను ఒక తండ్రికి కూతురిగా, ఒక ఇంటికి కోడలిగా, ఒక భర్తకు భార్యగా ఉండడానికే ఇష్టపడతాను. ఇల్లు అంటే నాకు ఎంతో ఇష్టం. అందులోనూ జీవిత భాగస్వామిగా ఉండడం అంటే నాకు ఎంతో ఇష్టం. ప్రత్యేకించి నా జీవితాన్ని ఇంటికే పరిమితం చేయాలని కోరుకుంటున్నాను. ప్రపంచంలో ఏం చేసినా దొరకని ఆనందం జీవిత భాగస్వామిగా ఉంటే దొరుకుతుంది” అంటూ ఇన్ డైరెక్ట్ గా విజయ్ దేవరకొండ తో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయం విన్న నెటిజన్స్ ‘పెళ్లెప్పుడు?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి దీనిపై రష్మిక ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి.
కాలు నొప్పితో బాధపడుతున్న రష్మిక..
ఇక రష్మిక ఇటీవల జిమ్ లో వ్యాయామం చేస్తుండగా కాస్త కాలు బెణికిన విషయం తెలిసిందే. ఆ కాలుకు మూడు చోట్ల ఫ్రాక్చర్ అయిందని, ప్రస్తుతం కుంటుకుంటూ పనిచేసుకుంటున్నాను అని తెలిపింది. ఇక త్వరలోనే ఆరోగ్యంగా తిరిగి రావాలి అని, మళ్లీ సినిమాలు మొదలు పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.