Chhaava Talk..రష్మిక మందన్న (Rashmika Mandanna) .. ఈ పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కన్నడ బ్యూటీ అయిన ఈమె.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతోంది.ఒకవైపు సౌత్ లో సినిమాలు చేస్తూనే.. మరొకవైపు బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది.. ఈ క్రమంలోనే గతంలో యానిమల్ (Animal) సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు కథకు ప్రాధాన్యతనిస్తూ.. అద్భుతమైన క్యారెక్టర్ లో జీవించేసింది. అసలు విషయంలోకి వెళ్తే విక్కీ కౌశల్ (Vicky kaushal), రష్మిక మందన్న ప్రధాన పాత్రలో లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న బాలీవుడ్ లో విడుదలైన చిత్రం ఛావా (Chhaava). సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ ఇండస్ట్రీ ఈ సినిమాతో తన కోరికను తీర్చుకోబోతోంది అని స్పష్టం అవుతోంది.
యేసు భాయి పాత్రలో జీవించేసిన రష్మిక..
ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజుగా నటించగా.. ఆయన భార్య యేసు భాయి పాత్రలో రష్మిక మందన్న చాలా అద్భుతంగా నటించింది.
ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి రష్మిక మందన్న నటనే హైలెట్గా నిలిచింది అని చెప్పవచ్చు. యేసు భాయి క్యారెక్టర్ లో రష్మిక మందన్న ఒదిగిపోయింది. మహారాణిగా మహారాజు అడుగుజాడల్లో నడుస్తూ.. రాజ్యంలో ఆయన లేని సమయంలో తన పరివారంతో పాటు రాజ్యం మొత్తానికి ఒక ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చే పాత్రలో చాలా అద్భుతంగా నటించింది. ఈ పాత్రలో రష్మిక తప్ప మరెవరు న్యాయం చేయలేరు అనేంతలా జీవించేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో బాలీవుడ్లో దూసుకుపోతోంది. చాలామంది రష్మిక కోసమే ఈ సినిమా చూస్తున్నారని సమాచారం.
బాలీవుడ్ లో రష్మిక అదృష్టం పండిందిగా..
ఎన్నో సంవత్సరాలుగా బాలీవుడ్ లో పాగా వేయాలి అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న రష్మిక మందన్నకు అదృష్టం ఈ సినిమాతో పండిందని నెటిజన్లు కూడా కామెంట్లు చేస్తున్నారు
సరైన క్యారెక్టర్ తగిలితే ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలలో జీవించేస్తారు అనడానికి రష్మిక నటనే ఉదాహరణ.. ఏది ఏమైనా ఇప్పటివరకు సౌత్ లో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఈ ఛావా సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఒకరకంగా చెప్పాలి రష్మిక నటనే సినిమాకి అత్యంత ప్లస్ గా మారిందని తెలుస్తోంది. ఇకపోతే రష్మిక నటించిన సినిమా విజయం సాధించడంతో.. కాలు బెణికినా.. సినిమా కోసం తనను తాను త్యాగం చేసుకుని, సినిమా ప్రమోషన్స్ చేసింది. రష్మిక పడిన కష్టం ఊరికే పోలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలే ఒక ఈవెంట్లో పాల్గొన్న రష్మిక , తనను మీ కుటుంబంలో ఒకరిగా చేర్చుకుంటారని భావిస్తున్నాను అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇప్పుడు తన నటనతో మెప్పించి బాలీవుడ్ ఫ్యామిలీలో ఒకరిగా చేరిపోయిందని అటు నార్త్ ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే అమ్మడి అదృష్టం మామూలుగా లేదని తెలుస్తోంది.