Rashmika Mandanna..ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద నేషనల్ క్రష్ గా పేరు దక్కించుకున్న రష్మిక మందన్న (Rashmika Mandanna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, చలాకీతనంతో సౌత్ ఆడియన్స్ హృదయాలను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఒక్క సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఫిదా చేసింది. ఈ క్రమంలోనే తాజాగా విక్కీ కౌశల్ (Vicky kaushal) , రష్మిక మందన్న ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం ఛావా (Chhaava). లక్ష్మణ్ ఉతేకర్ దర్శకత్వంలో శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ సినిమాలో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ పాత్ర పోషించగా.. ఆయన భార్య యేసు భాయ్ క్యారెక్టర్ లో రష్మిక మందన్న ఒదిగిపోయింది. ప్రేక్షకుల ముందుకు ఈరోజు వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా మీడియా ముందుకు వచ్చిన రష్మిక పుసుక్కున్న అంత మాట అనడంతో అభిమానులు , నెటిజన్లు, సినీ సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి రష్మిక చేసిన ఆ కామెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
కథకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తా – రష్మిక మందన్న..
సాధారణంగా ఎవరైనా సరే సినిమాలు ఎంచుకునేటప్పుడు తమ క్యారెక్టర్ కి ప్రాధాన్యత ఉండి, అందులోనూ కెరీర్ కు ఇబ్బంది కలగకుండా ఉండే పాత్రలను మాత్రమే ఎంచుకొని నటించడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం కథకు ప్రాధాన్యత ఇస్తూ.. అవసరమైతే బామ్మ పాత్రలో నటించడానికి కూడా సిద్ధమని చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది విన్న నెటిజన్స్ రష్మిక కాస్త ఆలోచించి మాట్లాడు.. ఒకవేళ నీకు అదే క్యారెక్టర్ ఇస్తే తర్వాత నీ కెరియర్ ఏంటి? అంటూ కూడా కామెంట్లు చేయడం గమనార్హం.
నలుగురు పిల్లల తల్లిగా నటించడానికి కూడా సిద్ధం..
రష్మిక మందన్న మాట్లాడుతూ.. “నేను దేనిని కూడా అంత సీరియస్ గా తీసుకోను. చేసే పని ఏదైనా సరే నిజాయితీగా చేస్తాను. అందుకే ఒక సినిమాను ఒప్పుకునే ముందు కథకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. కథ బాగుంటే ఏ పాత్ర చేయడానికి అయినా నేను సిద్ధమే.. బామ్మ పాత్రను, నలుగురు పిల్లలు ఉన్న తల్లిగా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు కథ నచ్చితే ఇలాంటి విషయాలు కూడా నేను పట్టించుకోను. ముఖ్యంగా కథలో భాగమవడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే చాలా సినిమాలు చేశాను. ఆ సినిమాల విజయం వెనుక నేను ఎలాంటి ప్రణాళికలు కూడా పెట్టుకోను. ప్రేక్షకాదరణ పొందడాన్ని ఇప్పుడు నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి మంచి కథలలో భాగం అవ్వడాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నేను నటిస్తున్న పాత్రలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తున్న నేపథ్యంలో నా ఆనందం రెట్టింపు అవుతోంది” అంటూ రష్మిక కామెంట్లు చేసింది.
నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్..
ఇకపోతే రష్మిక నలుగురు పిల్లలున్న తల్లిగా అలాగే బామ్మ పాత్రలో నటించడానికి కూడా సిద్ధమని అనడంతో.. ఈ వయసులో అప్పుడే ఇలాంటి కామెంట్స్ చేస్తే కెరియర్ చాలా ఉంది. ఇలాంటి మాటలు అనేటప్పుడు కాస్త ఆలోచించమ్మా అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి కొంతమంది రష్మిక నటనకు ఎలాంటి వారైనా ఫిదా అవ్వాల్సిందే. అందుకే ఆమె నటనకు ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి వయసుతో సంబంధంలేని పాత్రలు కూడా చేయడానికి సిద్ధమని చెబుతోంది. ఈమె డెడికేషన్ చూస్తే ముచ్చటేస్తోంది అంటే కామెంట్లు చేస్తున్నారు.