Rashmika Mandanna Emotional:అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar)ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘పుష్ప-2’ సినిమా.. షూటింగ్ పూర్తయింది.. ఈ సందర్భంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న(Rashmika mandanna)ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఈ పోస్ట్ చూస్తే గనుక, ఆ చిత్ర బృందంతో రష్మిక ఎంతలా కనెక్ట్ అయిందో ఇట్టే అర్థమవుతుంది. మరి రష్మిక షేర్ చేసిన ఆ పోస్ట్ లో ఏముందో ఇప్పుడు చూద్దాం.
ఎమోషనల్ పోస్ట్ పెట్టిన రష్మిక..
రష్మిక తన పోస్ట్ లో.. “ఈనెల 24వ తేదీన పుష్ప సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, చెన్నైలో ఈవెంట్ కి వెళ్ళాము. అయితే అదే రోజు రాత్రి హైదరాబాద్ కి వచ్చాం. ఇక ఇంటికి వెళ్లి కేవలం నాలుగు నుంచి ఐదు గంటలు మాత్రమే నిద్రపోయాను. తర్వాత రోజు ఉదయం లేచి పుష్ప సినిమాలో నా చివరి రోజు షూటింగ్ కి వెళ్లడం జరిగింది. అయితే ఆరోజు ఒక అద్భుతమైన సాంగ్ షూట్ చేశాము. పుష్ప సినిమాకు సంబంధించి అదే నాకు చివరి రోజు కూడా.. కానీ ఏదో తెలియని బాధ. ఎందుకు అనేది మాత్రం ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు.. నా ఎనిమిదేళ్ల సినీ కెరియర్లో గత ఐదేళ్లుగా ఈ సినిమా సెట్ లోనే ఉన్నాను. అయినా కూడా ఇంకా పని మిగిలే ఉంది. పార్ట్-3 కూడా ఉంది కదా.. అయితే అది వేరే విషయం.. కానీ పుష్ప -2 కి ఇదే లాస్ట్ డే. నాకు తెలియని ఏదో దుఃఖం.. అన్ని ఎమోషన్స్ ఒకేసారి వచ్చి నన్ను కలుసుకున్నాయి. చాలా అలసిపోయాను కూడా.. అయితే ఎంతో గర్వంగా ఉంది. గొప్ప వ్యక్తులతో కలిసి పని చేయడం, మనకు తెలియకుండానే వారితో బాండ్ ఏర్పడడం అన్నీ కూడా సంతోషంగా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్, సుకుమార్ తో పాటు చిత్ర బృందంతో పనిచేయడం మరింత ఆనందంగా ఉంది. వారితో ఒక ఎమోషనల్ బాండ్ ఏర్పడింది. పుష్ప సెట్ నాకు హోమ్ గ్రౌండ్ అలాంటిది ఇక 2024 నవంబర్ 25 నాకు చాలా కష్టమైన రోజు. ఎంతో విలువైన రోజు కూడా”.. అంటూ ఎమోషనల్ అయింది రష్మిక. ప్రస్తుతం రష్మిక షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.
పుష్ప-2 సినిమా..
పుష్ప -2 సినిమా విషయానికి వస్తే.. పుష్ప సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కాబోతోంది. ఇటీవలే పాట్నాలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా.. భారీ రెస్పాన్స్ అందుకుంది. అంతేకాదు అత్యధిక వ్యూస్ రాబట్టిన ట్రైలర్ గా రికార్డు సృష్టించింది. దీనికి తోడు ఇటీవల విడుదలైన పుష్ప -2 స్పెషల్ సాంగ్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.