BigTV English

Robinhood Movie: ‘రాబిన్‌హుడ్’లో డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్.. అదే సస్పెన్స్ అంటున్న డైరెక్టర్

Robinhood Movie: ‘రాబిన్‌హుడ్’లో డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్.. అదే సస్పెన్స్ అంటున్న డైరెక్టర్

Robinhood Movie: మామూలుగా ఒక హీరో సినిమాలో మరొక హీరో గెస్ట్ రోల్ చేయడం, దాని వల్ల మూవీకే హైప్ రావడం లాంటివి కామన్‌గా జరుగుతూనే ఉంటాయి. కానీ సినిమాల్లో వ్యాపారవేత్తలు, క్రికెటర్స్ గెస్ట్ రోల్స్ చేయడం చాలా అరుదు. అలాంటి సమయంలో అయితే మూవీకి ఉండే బజ్ మరింత పెరిగిపోతుంది. ప్రస్తుతం నితిన్ హీరోగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న ‘రాబిన్‌హుడ్’పై ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ చేయడానికి మేకర్స్ అదే ప్లాన్ చేశారు. ఇప్పటికే నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో ‘భీష్మ’ అనే మూవీ తెరకెక్కి కామెడీతో ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్‌టైన్ చేసింది. ఇప్పుడు ‘రాబిన్‌హుడ్’ కూడా ఆడియన్స్‌లో అదే రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేయడం కోసం ఒక క్రికెటర్‌ను రంగంలోకి దించారు.


తెలుగు ప్రేక్షకులకు క్లోజ్

డేవిడ్ వార్నర్ (David Warner).. ఈ పేరు క్రికెట్ ప్రపంచంలోనే కాదు.. సినిమా ప్రపంచంలో కూడా చాలా ఫేమస్. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో డేవిడ్ వార్నర్‌కు సెపరేట్ క్రేజ్ ఉంది. కోవిడ్ సమయంలో చాలామంది సోషల్ మీడియాలో డబ్‌స్మాష్‌లు, డ్యాన్స్‌లు చేసి వారి ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేశారు. ఇక డేవిడ్ వార్నర్ కూడా తను క్రికెటర్ అని మర్చిపోయి మరీ తెలుగు పాటలకు స్టెప్పులేశాడు. అలా అప్పటినుండి వార్నర్‌తో తెలుగు ప్రేక్షకులకు అనుబంధం ఏర్పడింది. ముఖ్యంగా ‘పుష్ఫ’ విడుదలయిన తర్వాత ఆ సినిమాలోని ఫేమస్ డైలాగులు, పాటలపై వీడియోలు తీశాడు. ఇప్పుడు ‘రాబిన్‌హుడ్’ (Robinhood) సినిమాతో ఏకంగా తెలుగు వెండితెరపై కనిపించడానికి సిద్ధమయ్యాడు.


Also Read: బంపర్ ఆఫర్ కొట్టేసిన శ్రీ లీల.. సూపర్ హిట్ హీరోతో రొమాన్స్ కి సిద్ధం..!

ఫోటోలు లీక్

నితిన్ (Nithiin) హీరోగా నటిస్తున్న ‘రాబిన్‌హుడ్’లో డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నాడనే వార్త ఇప్పటికే బయటికొచ్చింది. కొన్నాళ్ల క్రితం ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేయడానికి మేకర్స్ అంతా ఆస్ట్రేలియా వెళ్లారు. అక్కడ ‘రాబిన్‌హుడ్’ షూటింగ్ స్పాట్‌లో డేవిడ్ వార్నర్ కనిపించాడు. దీంతో అక్కడ ఉన్న తెలుగు ప్రేక్షకులు వార్నర్‌ను ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. మొత్తానికి ‘రాబిన్‌హుడ్’లో డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ ఉంటుందనే విషయం మేకర్స్ ప్రకటించక ముందే బయటికొచ్చింది. తాజాగా ఈ మూవీ విశేషాలను పంచుకోవడానికి హీరోతో పాటు దర్శకుడు, నిర్మాతలు కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంతో అక్కడ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ గురించి ప్రశ్న ఎదురయ్యింది.

కామెడీపై పట్టు

‘రాబిన్‌హుడ్’లో డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ ఎలా ఉండబోతుంది అని దర్శకుడు వెంకీ కుడుములను అడగగా.. టైమ్ వచ్చినప్పుడు అది రివీల్ అవుతుంది అంటూ ప్రేక్షకులను సస్పెన్స్‌లో పెట్టేశాడు. ‘ఛలో’ అనే మూవీతో దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు వెంకీ కుడుముల. మొదటి సినిమాతోనే తనకు కామెడీపై పట్టు ఉందని ప్రేక్షకులకు తెలిసేలా చేశాడు. ఆ తర్వాత నితిన్‌తో చేసిన ‘భీష్మా’ కూడా బాగానే వర్కవుట్ అయ్యింది. మొత్తానికి ఇప్పుడు నితిన్‌తోనే ‘రాబిన్‌హుడ్’ అనే మరో కామెడీ మూవీని తెరకెక్కించాడు. డిసెంబర్‌లో ఈ సినిమా విడుదల కానుండగా.. ఇప్పటినుండే ప్రమోషనల్ కార్యక్రమాలు మొదలుపెట్టేశారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×