Rashmika – Deepika:ఈమధ్య కాలంలో సౌత్, నార్త్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అభిమానుల సంఖ్య కూడా పెరిగిపోతోంది.ఇక ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధికంగా అభిమానులను సొంతం చేసుకున్న జాబితాలో ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) తర్వాత దీపికా పదుకొనే (Deepika Padukone) నిలిచింది. అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్లో టాప్ -5 జాబితా తీస్తే, అందులో దీపిక పదుకొనే ఒకరు అని చెప్పవచ్చు. మరొకవైపు ఐశ్వర్యరాయ్ చాలా అరుదుగా మాత్రమే సినిమాలు చేస్తోంది. ఇంకొక వైపు ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హాలీవుడ్ కి వెళ్ళిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ రాజమౌళి (Rajamouli ), మహేష్ బాబు (Maheshbabu) సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. దీంతో దీపికా పదుకొనే పాపులారిటీ మరింత పెరిగిపోయింది. కత్రినా కైఫ్ (Katrina Kaif), కరీనా కపూర్ (Kareena Kapoor), అలియా భట్(Alia bhatt) లాంటి భామలు ఉన్నా.. వాళ్ళను మించిన క్రేజీ బ్యూటీగా దీపిక పేరు మారుమ్రోగుతోంది. మరొకవైపు సోలో పెర్ఫార్మెన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొడుతూ.. భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. పైగా వందల కోట్ల బడ్జెట్ సినిమాలలో భాగం అవుతోంది. ఏది ఏమైనా బెంగళూరు నుంచి వచ్చిన ఈమె బాలీవుడ్ లో సత్తా చాటుతోందంటే దానికోసం ఎంత శ్రమపడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
క్రేజ్ విషయంలో దీపికాతో పడుతున్న రష్మిక..
అయితే ఇలాంటి దీపికా పదుకొనే క్రేజ్ ని కూడా బ్రేక్ చేయడానికి సిద్ధమవుతోంది మరో బెంగళూరు బ్యూటీ రష్మిక మందన్న (Rashmika mandanna).’పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా వైడ్ వెలుగులోకి వచ్చిన ఈమె, ‘యానిమల్’ సినిమాతో మరింత ఫేమస్ అయ్యింది. దీనికి తోడు ఇటీవల విడుదలైన ‘పుష్ప2’ సినిమాతో ఆ క్రేజ్ ను రెట్టింపు చేసుకుందని చెప్పవచ్చు. ముఖ్యంగా సౌత్, నార్త్ అని తేడా లేకుండా స్టార్స్ అందరూ కూడా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్ల క్రితమే బాలీవుడ్ లోకి ‘గుడ్ బాయ్’ సినిమాతో అడుగుపెట్టిన రష్మిక, ‘మిషన్ మజ్ను’ సినిమాలో కూడా భాగమయ్యింది. ఇక ఇప్పుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వస్తున్న ‘ఛావా’ సినిమాలో కూడా నటిస్తోంది. ఇక సినిమా లైనప్ పక్కన పెడితే, నార్త్ లో ఈమె క్రేజ్ భారీగా పెరిగిపోయింది. టాలీవుడ్ తరహా లోనే బాలీవుడ్ లో కూడా చలాకీతనంతో అక్కడ ఫాలోయింగ్ పెంచుకుంటుంది .ముఖ్యంగా మరిన్ని విజయాలు అక్కడ ఈమెకు మరింత క్రేజ్ అందిస్తున్నాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా రష్మిక కు కూడా బాలీవుడ్లో భారీగా పాపులారిటీ లభిస్తోంది.
బెంగళూరు నుంచి భారీ ఫోకస్..
ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇద్దరు కూడా బెంగళూరు నుంచి వచ్చిన వాళ్లే.. కానీ రష్మికకి అటు సౌత్ నుంచి ఇటు నార్త్ లో కూడా పాపులారిటీ లభించింది. కానీ దీపిక ఒక్క బాలీవుడ్ కే పరిమితం అవగా.. ఇప్పుడిప్పుడే సౌత్ లో పేరు దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే మరొకవైపు వీరిద్దరూ కూడా ఒకరు పోటీపడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారని చెప్పవచ్చు. అటు ఐశ్వర్యరాయ్ కూడా బెంగళూరు నుంచి వచ్చి బాలీవుడ్ లో భారీ పాపులారిటీ అందుకుంది.