Concussion Substitutes: భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టీ-20 ల సిరీస్ లో భాగంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ని 3 – 1 తో కైవసం చేసుకుంది భారత జట్టు. జనవరి 31 శుక్రవారం రోజున పూణే వేదికగా జరిగిన నాలుగవ మ్యాచ్ లో 15 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ తుది జట్టులో స్థానం దక్కకపోయినా.. అనూహ్యంగా భారత యువ పేసర్ హర్షిత్ రాణా అరంగేట్రం చేశాడు.
Also Read: Hardik – Kohli: ధోని, కోహ్లీ రికార్డు బద్దలు.. తొలిప్లేయర్ గా పాండ్యా రికార్డు !
అంతేకాకుండా ఇంగ్లాండ్ జట్టులోని కీలక వికెట్లను పడగొట్టి టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. శివమ్ దూబే స్థానంలో కంకషన్ సబిస్టిట్యూడ్ గా బరిలోకి దిగి మ్యాచ్ ని మలుపు తిప్పాడు. అయితే ఈ కంకషన్ సబిస్టిట్యూడ్ అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. దీన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తో సహా మాజీ క్రికెటర్లు సైతం తప్పుపడుతున్నారు. ఇది రూల్స్ కి విరుద్ధం అని, అన్యాయం అని కెప్టెన్ జోస్ బట్లర్ అసహనం వ్యక్తం చేశాడు.
అసలు ఈ రూల్ ఏంటంటే.. క్రికెట్ లో ప్రమాదాలు తగ్గించేందుకు, ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ మరణం వంటి ఉదాంతాలు పునరావృతం కాకుండా ఉండే ఉద్దేశంతో ఐసిసి ఈ కంకషన్ రూల్ ని తీసుకువచ్చింది. క్రికెట్ లో ఆటగాడు గాయపడినా లేక అనారోగ్యంతో ఉన్న ఆటగాడి స్థానంలో ఫిట్ గా ఉండే ఆటగాడిని ప్రత్యామ్నాయం అంటారు. క్రికెట్ లో టాక్టికల్ సబిస్టిట్యూడ్, కంకషన్ సబిస్టిట్యూడ్, ఇటీవల కోవిడ్ 19 సబిస్టిట్యూడ్ వంటి వివిధ రకాల ప్రత్యామ్నాయాలు ఉన్నాయి.
ఇక కంకషన్ సబ్బిస్టిట్యూట్ విషయానికి వస్తే.. బ్యాటర్ హెల్మెట్, తల లేదా మెడ భాగంలో బంతి తాగినప్పుడు తప్పనిసరిగా ఫిజియోలు వచ్చి పరిశీలించాలనే నియమం పెట్టింది ఐసీసీ. అంతేకాకుండా కంకషన్ గాయానికి గురైన ప్లేయర్ ఆడలేని పరిస్థితులలో ఉంటే సబిస్టిట్యూడ్ గా మరొకరిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాన్ని కల్పించింది. 2019 జూలైలో ఐసీసీ ఈ కంకషన్ సబిస్టిట్యూడ్ ని ఉపయోగించడానికి అంగీకరించింది.
అయితే సబిస్టిట్యూడ్ తప్పనిసరిగా మ్యాచ్ రిఫరీచే ఆమోదించబడాలి. ఐసీసీ రూల్ 1.2.7.1 ప్రకారం.. తల లేదా మెడ గాయం అయినప్పుడు మాత్రమే సబిస్టిట్యూడ్ కి అవకాశం. రూల్ 1.2.7.2 ప్రకారం.. కంకషన్ తప్పనిసరిగా టీం మెడికల్ రిప్రజెంటేటివ్ ద్వారా అధికారికంగా నిర్ధారణ చేయబడి ఉండాలి.
Also Read: Jos Buttler: టీమిండియా తొండాట…”కంకషన్ సబ్‌స్టిట్యూట్” పై ICCకి ఫిర్యాదు..అసలు ఈ రూల్ ఏంటీ !
1.2.7.3 ప్రకారం.. జట్టు యొక్క మెడికల్ రిప్రజెంటేటివ్ ఐసిసి మ్యాచ్ రిఫరీ కి ఒక కంకషన్ రీప్లేస్మెంట్ అభ్యర్థనను ఒక ప్రామాణిక ఫారం లో భర్తీ చేయాల్సిన ఆటగాడి గుర్తింపు, గాయం యొక్క వివరణ, సమయం, నామినేటెడ్ కంకషన్ రీప్లేస్మెంట్ పేరు పొందుపరచాలి. 1.2.7.4 ప్రకారం 36 గంటలలోపు అభ్యర్థనను సమర్పించాలి. ఈ నిర్ణయాన్ని అప్పిల్ చేసే అవకాశం ప్రత్యర్థి జట్టుకు ఉండదు. ఈ క్రమంలోనే మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్.. శివమ్ దూబే స్థానంలో హర్షిత్ రానాని ఆల్ రౌండర్ గా పరిగణించి కంకషన్ సబిస్టిట్యూడ్ కి అనుమతించారు.