Road Accident: ప్రైవేట్ ట్రావెల్స్ దందాలు అడ్డూ అదుపూ లేకుండా పోతున్నాయి. ఓవర్ స్పీడ్ కారణంగా ప్రయాణికుల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతోంది. తాజాగా జోగులాంబ గద్వాల్ జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. యూటర్న్ చేసుకుంటున్న బండల లారీని.. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. దాన్ని మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొన్న ఘటన జోగులాంబ గద్వాల్ జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా దగ్గర జరిగింది. ఒక బస్సులో 35 మంది ప్రయాణికులు, మరో బస్సులో 40 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. గాయపడినవారిని కర్నూల్ ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు రంగారెడ్డి జిల్లా నార్సింగిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్యుడు జస్వంత్ మృతి చెందాడు. మరో వైద్యురాలు భూమికకు తీవ్ర గాయాలయ్యాయి. జన్వాడ నుంచి తిరిగి వస్తుండగా ఖానాపూర్ వద్ద కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. వారిద్దరూ కామినేని ఆస్పత్రిలో హౌస్ సర్జన్స్‌గా చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారికి ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: విషాద ఘటన.. అంత్యక్రియలకు డబ్బుల్లేక.. తల్లి డెడ్ బాడీతో ఇంట్లోనే..
ఇదిలా ఉంటే.. డ్రైవర్, క్లీనర్‌ల దందా కూడా మామూలుగా లేదు. తిరుపతి నుంచి బెంగళూరు వెళ్లే యోలో ట్రావెల్స్‌లో ప్రయాణికులపై దౌర్జన్యానికి దిగారు. సీట్లు క్లీన్‌గా లేవంటూ ప్రశ్నిస్తే.. మీ సీట్లు మీరే క్లీన్ చేసుకోవాలంటూ నోరు పారేసుకున్నారు.