BigTV English
Advertisement

Rashmika Mandanna : డీప్ ఫేక్ ఎఫెక్ట్… టాప్ పొజిషన్‌ను దక్కించుకున్న నేషనల్ క్రష్

Rashmika Mandanna : డీప్ ఫేక్ ఎఫెక్ట్… టాప్ పొజిషన్‌ను దక్కించుకున్న నేషనల్ క్రష్

Rashmika Mandanna : కొన్ని రోజుల క్రితం పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఒకటి నెట్టింట దుమారం రేపిన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే దీని ఎఫెక్ట్ కారణంగా తాజాగా రష్మిక మందన్న ఒక టాప్ పొజిషన్ ను దక్కించుకుంది. మరి ఆమె దక్కించుకున్న ఆ టాప్ పొజిషన్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…


సైబర్ క్రైమ్ సెంటర్ కు బ్రాండ్ అంబాసిడర్

తన అందం, అభినయంతో నేషనల్ క్రష్ అనే బిరుదును దక్కించుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తాజాగా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులవ్వ డం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోంశాఖకు సంబంధించిన సైబర్ దోస్త్ విభాగం ప్రకటించింది. అలాగే రష్మిక మందన్న కూడా ఓ స్పెషల్ వీడియోను రిలీజ్ చేసి అందులో తాను గతంలో ఎదుర్కొన్న డీప్ ఫేక్ గురించి ప్రస్తావించడం గమనార్హం. ఆ వీడియోలో రష్మిక మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం తన డీప్ ఫేక్ వీడియో వైరల్ గా మారిన సంగతిని గుర్తు చేసింది. అది సైబర్ క్రైమ్ అంటూ ఆ చేదు ఎక్స్పీరియన్స్ తర్వాత తను సైబర్ క్రైమ్ కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నానని, అందరికీ ఈ విషయం గురించి అవగాహన కల్పించాలని అనుకున్నానని వెల్లడించింది. ఇక ఇప్పుడు సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కు తాను బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడానికి సంతోషిస్తున్నాను అంటూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. కాగా ఈ శాఖ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. ‘సైబర్ నేరస్థులు మనల్ని టార్గెట్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. కాబట్టి మనం అలర్ట్ గా ఉంటూ వాళ్ళ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ బ్రాండ్ అంబాసిడర్ గా నేను ఇలాంటి నేరాలపై ప్రజలకు అవగాహన కలిగిస్తాను. దేశాన్ని సైబర్ క్రైమ్ నేరాల నుంచి కాపాడుతాను’ అంటూ రష్మిక మందన్న హామీ ఇచ్చారు.


రష్మిక మందన్న డీప్ ఫేక్ వివాదం

కాగా గతంలో రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. జారా పటేల్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీడియోకు రష్మిక ముఖాన్ని ఏఐ ఉపయోగించి ఎడిట్ చేశారు. ఆ వీడియో చూడడానికి అభ్యంతరకరంగా ఉండడంతో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఈ విషయంపై ముందుగా అమితాబ్ బచ్చన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ తర్వాత రష్మిక మందన్న ఇలాంటి వీడియోల వల్ల టెక్నాలజీ అంటేనే భయంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేయగా,  రష్మిక వీడియోపై పలువురు సినీ ప్రముఖులు ఫైర్ అయ్యారు. ఇక సదరు నిందితుడిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత ఎంతోమంది సినీ, క్రీడా ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోలు ఎప్పటిలాగే వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×