Rashmika mandanna:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు దక్కించుకున్న రష్మిక మందన్న (Rashmika mandanna) నేడు పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతోంది. అలాంటి ఈమె అభిమానులకు ఇప్పుడు పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు. తాజాగా రష్మిక మందన్న వీల్ చైర్ లో కనిపించారు. నడవలేని స్థితిలో శంషాబాద్ ఎయిర్పోర్టులో వీర్ చైర్ లో ప్రత్యక్షమయ్యేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల జిమ్ లో వ్యాయామం చేస్తూ.. రష్మిక మందన్న కాలు బెణికిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ గాయం కాస్త పెద్దది అయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు నడవలేని స్థితిలో శంషాబాద్ ఎయిర్పోర్టులో ఆమె కనిపించింది. ఈ వీడియో చూసిన అభిమానులు ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. అంతేకాదు త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.
వీల్ చైర్ లో ముఖం కప్పేసుకున్న రష్మిక..
వీల్ చైర్ లో తన ముఖాన్ని తాను చూపించుకోలేక ఎంతో ఇబ్బంది పడింది రష్మిక. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఈమె, నడవలేని స్థితిలో ఉండడంతో వీల్ చైర్ లోనే ఈమెను తీసుకెళ్లారు. తన ముఖం కనిపించకుండా క్యాప్ తో కవర్ చేసారు. అంతేకాదు ఆమె తల దించుకొని మొబైల్ చూస్తున్నట్టు మనం అక్కడ చూడవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇకపోతే ఈమె కాలు బెణికిన కారణంగా కోలుకోవడానికి నెలలు కూడా పట్టొచ్చు ఏమో అని తాజాగా ఇన్స్టా లో పోస్ట్ చేశారు రష్మిక. ప్రస్తుతం రష్మిక కు సంబంధించిన ఈ వీడియో చాలా వైరల్ గా మారుతోంది.
రష్మిక ప్రస్తుత చిత్రాలు..
రష్మికకు ఈమధ్య పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా మారిపోయింది. కమర్షియల్ రోల్స్ లో అద్భుతంగా నటించి దూసుకుపోతోంది. ఇటీవలే ‘పుష్ప 2’ సినిమాతో అదరగొట్టిన ఈమె ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం ‘ఛత్రపతి’ లో నటిస్తోంది.ఈ సినిమాలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ (Vicky kaushal) నటిస్తూ ఉండగా.. మహారాణి యేసు బాయి గా రష్మిక ఇందులో కనిపించబోతోంది. ఈ మహారాణి పాత్రలో రాజరికపు లుక్ లో రష్మిక మందన్న చాలా అద్భుతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఛత్రపతి నుండి రష్మిక మందన్న తన మొదటి లుక్ పోస్టర్ను ఆవిష్కరించింది. ఇందులో ఆమె మహారాణి యేసు బాయిగా నటిస్తున్నారు. పట్టు చీర, ఆభరణాలతో మహారాణి గెటప్ లో చాలా అందంగా మెరిసిపోతోంది. ఈ పోస్టర్ షేర్ చేస్తూ..’ స్వరాజ్యపు గర్వం’ అని ఆమె ఈ పోస్టును షేర్ చేసింది.ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ జనవరి 22వ తేదీన విడుదల కాబోతున్నట్లు సమాచారం.
విడుదల తేదీ..
ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాలో విక్కీ కౌశల్, అక్షయ్ ఖన్నా,దివ్యా దత్త తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">