E-Paper
Advertisement

Rashmika Mandanna : షూటింగ్ కి నో చెప్పిన రష్మిక.. పాపం అదే అసలు కారణం..

Rashmika Mandanna : షూటింగ్ కి నో చెప్పిన రష్మిక.. పాపం అదే అసలు కారణం..
Advertisement

Rashmika Mandanna : ప్రస్తుతం సౌత్ ఇండియాలో క్రేజియస్ట్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన నటి రష్మిక మందన్నా. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కుర్ర కారును ఫిదా చేసి .. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా నేషనల్ క్రష్ గా గుర్తింపు పొందింది. పుష్ప చిత్రం తో ఫారిన్ సెలబ్రిటీలను సైతం’ నా సామి..’ అంటూ స్టెప్పులు వేసేలా చేసింది.. రష్మీక. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ తో బాగా బిజీగా ఉన్న రష్మిక త్వరలో యానిమల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మీక కాంబోలో వస్తున్న యానిమల్ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 1 న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కాబోతోంది. దీంతో రష్మిక చిత్ర బృందంతో కలిసి ప్రమోషన్స్ లో కూడా చురుకుగా పాల్గొంటుంది. ప్రమోషన్స్ లో భాగంగానే మొన్న బాలయ్య ఆల్ టైం ఫేవరెట్ టాక్స్ షో అన్ స్టాపబుల్ లో హీరో, డైరెక్టర్ తో కలిసి సందడి చేసింది రష్మిక. ఈ సందర్భంగా బాలయ్య విజయ్ దేవరకొండ కి కాల్ చేయించి మరి రష్మీక ను ఆట పట్టించాడు . దీనికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేశాయి.

Advertisement

అయితే ప్రస్తుతం రష్మిక హెల్త్ కు సంబంధించిన ఒక వార్త ఆమె అభిమానులను కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న కారణంగా కమిట్ అయిన అన్ని సినిమాల షూటింగ్స్ కి ప్రస్తుతానికి బ్రేక్ చెప్పింది రష్మిక. రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా అని క్యాప్షన్ పెట్టి బెడ్ పై పడుకొని ఉన్న కొన్ని పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ బ్యూటీ. 

దీంతో తమ ఫేవరెట్ హీరోయిన్ త్వరగా కోలుకోవాలి అని కామెంట్లు పెట్టడంతో పాటు అభిమానులు ఈ పోస్ట్ ని బాగా వైరల్ చేశారు. ప్రస్తుతం రష్మిక చేతిలో క్రేజీ ప్రాజెక్ట్ చాలానే ఉన్నాయి. వరుస షూటింగ్స్ తో బిజీగా ఉన్న ఈ బ్యూటీ సడన్ బ్రేక్ తీసుకోవడం షూటింగ్స్ పై ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో తెలియదు. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో మూడు సినిమాలు..తెలుగులో మూడు సినిమాలు ..తమిళ్ లో ఒక సినిమా చేస్తోంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×