BigTV English

Rashmika: స్టార్ హీరోలకు ధీటుగా ‘రష్మిక’ షాకింగ్ డెసిషన్!?

Rashmika: స్టార్ హీరోలకు ధీటుగా ‘రష్మిక’ షాకింగ్ డెసిషన్!?

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. “పుష్ప 2: ది రూల్” (Pushpa 2: The Rule) విజయం తర్వాత ఆమె కెరీర్ మరింత ఉన్నత స్థాయికి చేరింది. సినీ కెరీర్‌ను కన్నడ సినిమాలతో ప్రారంభించి, ఆ తర్వాత తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగింది రష్మిక. “కిరిక్ పార్టీ” సినిమాతో హీరోయిన్‌గా కన్నడ ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ అయిన ఈ ముద్దుగుమ్మ.. “చలో” సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత.. విజయ్ దేవరకొండ సరసన నటించిన గీతా గోవిందం సినిమా ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, ఆమెను టాప్ హీరోయిన్‌ లిస్ట్‌లోకి తీసుకెళ్లింది. ఇక పుష్ప: ది రైజ్ సినిమాలో అల్లు అర్జున్ సరసన శ్రీవల్లి పాత్రలో నటించి, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. “సామీ సామీ” పాట ఆమెను జాతీయ స్థాయిలో పాపులర్ చేసింది. ఇక్కడి నుంచి రష్మిక క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది.


బాలీవుడ్ లక్కీ గాళ్

“గుడ్‌బై” సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రష్మిక, ఆ తర్వాత “మిషన్ మజ్ను” అనే సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు ఇవ్వలేదు. కానీ”యానిమల్” సినిమా ఆమెను హిందీలో లక్కీ గాళ్‌గా మార్చేసింది. “యానిమల్”లో గీతాంజలి పాత్ర ఆమె నటనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పుష్ప పార్ట్ 1 సక్సెస్‌ను కంటిన్యూ చేస్తు.. యానిమల్‌తో నార్త్ ఆడియెన్స్‌కు మరింత చేరువైంది. ఇక పుష్ప 2: ది రూల్ సినిమా 1831 కోట్లకు పైగా వసూళ్లతో రికార్డులు బద్దలు కొట్టింది. శ్రీవల్లి పాత్రలో రష్మిక మరోసారి అదరగొట్టింది. “సూసేకి” పాట ఆమె గ్లామర్‌ను మరింత హైలైట్ చేసింది. ఇక ఛావా (Chhaava) సినిమాలో విక్కీ కౌశల్ సరసన నటించి నటిగా మరిన్న మార్కులు కొట్టేసింది. లేటెస్ట్‌గా సల్మాన్ ఖాన్ సరసన సికందర్ (Sikandar) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్‌కమింగ్ మూవీస్‌లలో ధనుష్ కుబేర (Kubera)తో పాటు.. ది గర్ల్‌ఫ్రెండ్ (The Girlfriend) లాంటీ లేడీ ఓరియేంటేడ్ సినిమాలున్నాయి. దీంతో.. రష్మికకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ హాట్ బ్యూటీ స్టార్ హీరోలకు ధీటుగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.


రెమ్యునరేషన్‌కు బదులుగా?

ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో మహేష్‌ బాబు (Mahesh babu), ప్రభాస్ (Prabhas) లాంటి వారు రెమ్యూనరేషన్‌కు బదులుగా వచ్చిన లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు రష్మిక కూడా పారితోషికానికి బదులుగా వాటాల్లో లాభాలు డిమాండ్ చేస్తోందట. ఏకంగా పది శాతం వాటా కావాలని డిమాండ్ చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. మామూలుగా అయితే.. ప్రజెంట్ ఒకొక్క సినిమాకు రూ. 3 నుంచి రూ. 4 కోట్ల వరకు అందుకుంటోంది అమ్మడు. కానీ రాబోయే చిత్రాలకు రెమ్యునరేషన్‌కు బదులుగా ప్రాఫిట్‌లో వాటా కావాలని అంటోందట. ఆమె నటిస్తున్న చిత్రాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. మేకర్స్ కూడా అందుకు వెనకడాడం లేదని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా.. పుష్ప 2, ఛావా వంటి భారీ విజయాల తర్వాత ఆమె మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది. అయితే.. హీరోలకు వాటాల్లో లాభాల్లో అంటే ఓకె, కానీ హీరోయిన్‌కు సాధ్యమేనా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇలాంటి డిమాండ్ పెడితే.. ఆఫర్లు తగ్గే ఛాన్స్ లేకపోలేదు. మరి ఇలాంటి వార్తల్లో ఎంత వరకు నిజముందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×