BigTV English

Latest Updates: మాస్ హీరో ప్లేస్‌లో మాస్‌ కా దాస్

Latest Updates: మాస్ హీరో ప్లేస్‌లో మాస్‌ కా దాస్

Ravi Teja Anudeep Movie Shelved Vishwaksen Replaces RaviTeja: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనుదీప్ కె.వి పేరు చెప్పగానే మనకు టక్కున గుర్తొచ్చే మూవీ జాతిరత్నాలు. ఈ మూవీతో మంచి బ్లాక్ బస్టర్ హిట్‌ని అందుకున్నారు. అదే జోరుతో 2022 ఏడాదిలో వచ్చిన ప్రిన్స్ అనే మూవీకి కూడా దర్శకత్వం వహించారు. కానీ ఆ మూవీ అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. ఫస్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనుదీప్ మీద టాలీవుడ్ ఆడియెన్స్‌కి చాలానే ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. మరో హిట్‌ తన ఖాతాలో పడితే మనోడి రేంజ్ ఓ రేంజ్‌లో ఉంటుందని టాలీవుడ్ ఆడియెన్స్‌ అభిప్రాయం.


సెకండ్‌ మూవీతో భారీ స్థాయిలో బోల్తాపడ్డ అనుదీప్ ఆ తర్వాత సినిమా ఆఫర్లు కూడా సరిగ్గా అందుకోలేకపోయాడు. అప్పటినుంచి స్టోరీని పట్టుకొని చాలామంది హీరోల దగ్గరికి వెళ్ళాడు. కానీ ఒకరు కూడా తన మూవీని చేయడానికి ముందుకు రాలేదు. ఇక అదే టైమ్‌లో మాస్ మహారాజు రవితేజ అనుదీప్‌తో మూవీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతా బాగానే ఉందనుకున్న టైమ్‌లో అనుదీప్ చెప్పిన స్టోరీలో సెకండ్ హాఫ్ నచ్చలేదని రవితేజ మూవీ నుంచి తప్పుకున్నారని టాక్. దీంతో అనుధీప్ కేవీ స్టోరీ మళ్లీ రివర్స్ అయ్యింది.

Also Read:  కలెక్షన్ల సునామి, బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న కల్కి


అయితే ఇప్పుడు అనుదీప్ మరొక యంగ్ హీరోని లైన్‌లో దింపుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ హీరో ఎవరనుకుంటున్నారా…? అదేనండీ మన మాస్‌ కా దాస్ విశ్వక్‌సేన్. ఈ మధ్యే వరుస డిజాస్టర్లతో డీలా పడిపోయిన మనోడు ఈ మూవీతో హిట్ పడితే విశ్వక్‌సేన్‌ కొంచెం రిలాక్స్ కావొచ్చనేది తన నమ్మకంగా కనిపిస్తోంది. అంతేకాదు వీరిద్దరి కాంబో అంటే మినిమం ఉంటుందని కొందరు నెటిజన్స్‌ భావిస్తే మరికొందరు మాత్రం నో కామెంట్స్ భయ్యా అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి వీరిద్దరి కాంబోలో రాబోతున్న మూవీ ఓకే అయితే ఏ రేంజ్‌లో ఆకట్టుకోనుందో తెలియాలంటే మూవీ రిలీజ్ అయ్యేంతవరకు వేచి చూడకతప్పదు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×