BigTV English

Good News for Goa commutes : గోవా వెళ్లే ప్రయాణికులకు తీపి కబురు

Good News for Goa commutes : గోవా వెళ్లే ప్రయాణికులకు తీపి కబురు

Good News for highway commutes: తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా(గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించనున్నట్లు తెలిపింది. అయితే, ఇప్పటివరకు వారానికి ఒక రైలు 10 బోగీలతో సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గుంతకల్ చేరుకుని, అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 బోగీలతో కలిపి ఒక నూతన రైలుగా మారి గోవాకు ప్రయాణం సాగించేది.


ఇది కాకుండా కాచిగూడ-యలహంక మధ్య వారానికి నాలుగు రోజులు ప్రయాణం సాగించే రైలుకు గోవాకు వెళ్లే 4 కోచ్ లను కలిపేవారు. ఈ నాలుగు కోచ్‌లను తిరిగి గుంతకల్ వద్ద షాలిమార్ – గోవా మధ్యన తిరిగే ట్రైన్‌కు కలిపి ప్రయాణం సాగించేవారు. ఇప్పుడు సికింద్రాబాద్ – వాస్కోడగామా(గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభిస్తున్నట్లు రైల్వేశాఖ తాజాగా ప్రకటించింది. దీంతో ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్ లకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Also Read: హైదరాబాద్ లో నిరుద్యోగుల ధర్నా వెనుక కారణం అదేనా?


హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గోవా వెళ్లే పర్యాటకుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో నూతన సర్వీసు అందుబాటులోకి రావడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్-గోవా బై-వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, గద్వాల్, మహబూబ్‌నగర్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, లోండా, ధార్వాడ్, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్ డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ.. వాస్కోడగామా చేరుకోనున్నదాని రైల్వేశాఖ తాజాగా వెల్లడించింది.

Tags

Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×