BigTV English
Advertisement

Ravi Teja: ర‌వితేజ‌తో హ‌రీష్ పీరియాడిక్ డ్రామా

Ravi Teja: ర‌వితేజ‌తో హ‌రీష్ పీరియాడిక్ డ్రామా

Ravi Teja: మాస్ మ‌హారాజా ర‌వితేజ, స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. ర‌వితేజ హీరోగా న‌టించిన షాక్ చిత్రాన్ని హరీష్ శంక‌ర్ డైరెక్ట్ చేశారు. ఆ మూవీ డిజాస్ట‌ర్ అయ్యింది. ఆ త‌ర్వాత హ‌రీష్ శంక‌ర్‌కు మిర‌ప‌కాయ్ సినిమాతో మ‌రోసారి లైఫ్ ఇచ్చారు ర‌వితేజ‌. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం భారీ విజ‌యం సాధించింది. త‌ర్వాత వీరిద్ద‌రి కాంబోలో సినిమా రూపొంద‌లేదు. ఫ్యాన్స్ వీరి కాంబినేష‌న్ కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే ప్ర‌శ్న‌ను అభిమానులు ర‌వితేజను డైరెక్ట్‌గా అడిగేశారు. ఏప్రిల్ 7న రావ‌ణాసుర రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ఆయ‌న సోష‌ల్ మీడియాలో అభిమానుల‌తో చిట్ చాట్ చేస్తున్నారు.


అందులో భాగంగా ఓ ఫ్యాన్‌.. హ‌రీష్ శంక‌ర్‌తో మీరెప్పుడు మ‌ళ్లీ సినిమా చేస్తున్నారు అని అడిగారు. దానికి ర‌వితేజ.. హరీష్ శంక‌ర్‌ను ట్యాగ్ చేస్తూ త‌మ్ముడు అభిమానులు ఇదేదో అడుగుతున్నారు చూడు అని అడిగారు. వెంట‌నే హ‌రీష్ రియాక్ట్ అయ్యారు. అన్న‌య్య‌తో సినిమా చేయ‌టానికి నేను ఎప్పుడూ సిద్ధ‌మే. అయితే పీరియాడిక్ డ్రామా సినిమా చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నాను అని అన్నారు. దీంతో.. ర‌వితేజ‌, హ‌రీష్ శంక‌ర్ కాంబోలో ఈసారి పీరియాడిక్ డ్రామా రానుంద‌నే విష‌యం స్ప‌ష్ట‌మైంది. అయితే అదెప్పుడ‌నేది మాత్రం తెలియాలంటే వేచి చూడాల్సిందే.

ర‌వితేజ ఇప్ప‌టికే వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్నారు. మ‌రో వైపు.. హ‌రీష్ శంక‌ర్, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తి చేసిన త‌ర్వాతే హ‌రీష్ నెక్ట్స్ సినిమాను ర‌వితేజ‌తో చేస్తాడనే టాక్ వినిపిస్తోంది. మరి దానికి సంబంధించిన ప్రకటన ఎప్పుడు వస్తుందనేది తెలియాలంటే వే చూడాల్సిందే. రవితేజ లేటెస్ట్ మూవీ రావణాసుర ఏప్రిల్ 7న రిలీజ్ అవుతుంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు.


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×