BigTV English

Maas Jathara: మళ్లీ మీసం మెలేయడానికి వస్తున్న రవితేజ.. గ్లింప్స్ రిలీజ్ డేట్ లాక్..!

Maas Jathara: మళ్లీ మీసం మెలేయడానికి వస్తున్న రవితేజ.. గ్లింప్స్ రిలీజ్ డేట్ లాక్..!

Maas Jathara: మాస్ మహారాజా రవితేజ (Raviteja)ఒక్క అవకాశం అంటూ వచ్చి , నేడు సీనియర్ స్టార్ హీరోగా సెటిల్ అయిపోయారు. ఈ వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ.. మాస్ హీరోగా పేరు దక్కించుకున్న ఈయన, తన అద్భుతమైన సినిమాలతో ప్రేక్షకులను వినూత్నంగా ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. గత ఏడాది ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన పెద్దగా అలరించలేకపోయారు. అందుకే ఎలాగైనా హిట్ కొట్టాలని భాను బోగవరపు దర్శకత్వంలో మాస్ జాతర అనే టైటిల్ తో సినిమా చేస్తున్నారు. బడా నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ (Surya devara nagavamshi), సాయి సౌజన్య(Sai Soujanya) ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రవితేజ కెరియర్ లో 75వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో మళ్లీ యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sreeleela) హీరోయిన్ గా నటించడానికి సిద్ధమయింది.


మాస్ జాతర సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు..

ఇదివరకే వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘ధమాకా’ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. అందుకే ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా హిట్ అవుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం. లక్ష్మణ్ భేరీ అనే పాత్రలో మాస్ మహారాజా కనిపించబోతున్నాడు. ఇకపోతే రవితేజకు ఇటీవల గాయం అవడంతో కాస్త సినిమా షూటింగు వాయిదా పడింది. ప్రస్తుతం ఆయన కోలుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే జెడ్ స్పీడ్ లో షూటింగ్ పూర్తి చేసే పనిలో పడ్డారు. తాజాగా ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ని జనవరి 17 నుండి హైదరాబాదులో మొదలు పెట్టగా.. ఇప్పటివరకు దాదాపు 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసినట్లు సమాచారం.


మాస్ మహారాజా గ్లింప్స్ రిలీజ్ డేట్ లాక్..

ఇదిలా ఉండగా ఈరోజు ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. మాస్ మహారాజా బర్త్ డే సందర్భంగా జనవరి 26వ తేదీన మాస్ జాతర టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్స్ రిలీజ్ చేశారు. ‘ధమాకా’ వంటి సూపర్ హిట్ సినిమాకి సంగీతాన్ని అందించిన బీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి కూడా సంగీతాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా రవితేజకు మాస్ బ్లాక్ బస్టర్ ఇవ్వాలని అటు అభిమానులు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

రవితేజ కెరియర్..

రవితేజ విషయానికి వస్తే.. ‘సింధూరం’ సినిమా ద్వారా సెకండ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ కొనసాగించిన ఈయన.. కొంతమంది స్టార్ హీరోల సినిమాలలో ఫ్రెండ్ క్యారెక్టర్ లలో కూడా నటించి మెప్పించారు. ఇక తర్వాత ‘నీకోసం’ సినిమాతో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ, ఇక తర్వాత నుంచి వరుస సినిమాలు చేస్తూ మాస్ మహారాజా గా పేరు దక్కించుకున్నారు. మరి ఇప్పుడు మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి ఈ సినిమా ఆయనకు.. మీసం మేలేసేలా సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి. ఏది ఏమైనా రవితేజ ఈసారి హిట్ కొట్టాలని బలంగా కోరుకుంటున్నట్లు సమాచారం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×