Guntur News: ఆ ఆలయం చాలా ప్రసిద్ది చెందిన ఆలయం. ఆలయం హుండీ లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అధికారులు కూడ వచ్చారు. ఇక హుండీ లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఒక్కొక్క హుండీ లెక్కించేందుకు, హుండీలను తెరిచారు. అందులో ఒక హుండీలోని నగదును వేస్తున్న క్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు షాక్ కు గురయ్యారు. ఔను.. ఆ హుండీలో నుండి పడిన నోట్లను చూసి వారు అవాక్కయ్యారు. ఇంతకు అంతలా షాక్ కు గురవడానికి గల కారణం తెలుసుకుంటే, మీరు కూడ ఔరా అనేస్తారు. అసలేం జరిగిందంటే..
గుంటూరు జిల్లా తెనాలిలోని వైకుంఠపురంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం వెలసి ఉంది. ఈ ఆలయం ఎంతో చారిత్రాత్మకమైనది కావడంతో నిరంతరం భక్తులు ఆలయానికి వస్తారు. ఇక్కడి స్వామి వారిని మొక్కు కుంటే చాలు, సకల కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అంతేకాదు కోరికలు తీరిన వెంటనే, ఇక్కడి హుండీలలో భక్తులు కానుకలు సమర్పిస్తారు. అలా హుండీలో గల కానుకలను ఆలయ అధికారులు లెక్కిస్తారు.
తాజాగా ఇదే ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయంలోని హుండీలను ఒకేచోటకు పోగు చేశారు. అలా పోగు చేసిన హుండీలలోని నగదును ఆలయ అధికారులు కింద వేశారు. అప్పుడే అసలు విషయాన్ని గుర్తించి అధికారులు, సిబ్బంది అలర్ట్ అయ్యారు. అసలేం జరిగిందంటే.. ఓ హుండీలో పెద్ద మొత్తంలో రూ. 2 వేల నోట్లు బయటపడ్డాయి. అది కూడ రూ. 2 లక్షల 44 వేలు విలువ చేసే 2 వేల రూపాయల నోట్లు బయటపడడంతో అధికారులు షాక్ కు గురయ్యారు. అసలే రూ. 2 వేల రూపాయల నోట్లు చెల్లవన్న విషయం అందరికీ తెలుసు. మరి ఏ భక్తుడు కానుకల రూపంలో నోట్లు వేశాడో కానీ, ఇప్పుడు చెల్లని నోట్లను ఏం చేయాలన్న ఆలోచనలో ఆలయ అధికారులు పడ్డారు.
Also Read: Janasena vs YCP: జనసేన వర్సెస్ వైసీపీ.. లైన్ క్రాస్ చేసి మరీ విమర్శలు!
ఈ నోట్లు రద్దు చేసిన సమయంలో మార్చుకొనేందుకు వీలున్నప్పటికీ, ఆ భక్తుడు ఇలా ఎందుకు చేశాడని అధికారులు చర్చించుకున్నారు. మొత్తం మీద చెల్లని రూ. 2 వేల నోట్లను పోగు చేసి భద్రంగా భద్రపరిచారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలుపనున్నట్లు అధికారులు తెలిపారు.