Thirsty: ప్రతి వ్యక్తికి త్రాగు నీరు చాలా ముఖ్యం. శరీరాన్ని హైడ్రేట్ చేయడానికి నీరు ఉపయోగపడుతుంది. ఇదిలా ఉంటే మీకు నీరు అవసరం అయినప్పుడు శరీరం సంకేతాలు ఇవ్వడం ప్రారంభిస్తుంది. కానీ ఎక్కువ లేదా తక్కువ నీరు త్రాగడం ఆరోగ్యానికి హానికరం. ఒక వేళ నీరు త్రాగిన తర్వాత కూడా మీకు మళ్లీ మళ్లీ దాహంగా అనిపిస్తే మాత్రం తప్పకుండా మీరు ఇందుకు గల కారణాలను తెలుసుకోవాలి. విపరీతంగా దాహం అనిపిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలకు ఇది సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం.
దాహం అనేది శరీరం నిర్జలీకరణకు గురవుతుందని తెలిపే మార్గం. అయితే వేసవి కాలంలో లేదా ఎక్కువ వ్యాయామం చేసినప్పుడు దాహం వేయడం సహజం. కానీ మీకు పదే పదే దాహం వేస్తుందంటే అనారోగ్యానికి సంకేతం కావచ్చు.
డీహైడ్రేషన్:
శరీరం సరిగ్గా పనిచేయడానికి నీరు తగినంతగా లేకపోవడాన్నే డీహైడ్రేషన్ అని అంటారు. వ్యాయామం, అతిసారం, వాంతులు, అధిక చెమట సమయంలో కూడా డీహైడ్రేషన్‌కు గురవుతూ ఉంటారు.
మధుమేహం:
రోజులో చాలా సార్లు దాహం వేసినా, లేదా మీ గొంతు తరచుగా పొడిగా అనిపించా కూడా మీరు వెంటనే మీ రక్తంలో చక్కెర స్థాయిని పరీక్షించుకోవాలి. డయాబెటీస్‌లో రక్తం నుండి అదనపు చక్కెరలను తొలగించడానికి మూత్రపిండాలు చాలా కష్టపడాలి. అటువంటి పరిస్థతిలో మన శరీరం నుండి ఎక్కవ నీరు బటయకు వెళ్తుంది. ఫలితంగా దాహంగా అనిపిస్తుంది.
రక్త హీనత:
శరీరంలో తగినంత రక్తం లేకపోవడాన్ని రక్త హీనత అని అంటారు. ఇటువంటి పరిస్థితిలో ఎర్ర రక్త కణాలు శరీరంలో తగినంత పరిమాణంలో ఉత్పత్తి చేయబడవు. అయినప్పటికీ తప్పుడు ఆహారపు అలవాట్లతో పాటు మరిన్ని కారణాల వల్ల తరచుగా రక్త హీనతకు గురవుతుంటారు. ఇటువంటి పరిస్థితిలో కూడా మీకు పదే పదే దాహం వేస్తుంది. దీని వల్ల డ్రై థ్రోట్ సమస్య కూడా పెరుగుతుంది.
Also Read: నిద్ర సరిగ్గా లేకపోతే బరువు పెరుగుతారా ? పరిశోధనల్లో షాకింగ్ నిజాలు
జీర్ణ సంబంధిత సమస్యలు:
ఒక వేళ మీరు వేయించిన ఆహారాన్ని తిన్నప్పుడల్లా అది మీ జీర్ణక్రియ ప్రక్రియపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా ఎక్కువగా దాహం వేస్తుంది.