BigTV English

Mass Jathara: మాస్ జాతర రిలీజ్ డేట్ లాక్.. గణేష్ ఉత్సవాలు థియేటర్లో..!

Mass Jathara: మాస్ జాతర రిలీజ్ డేట్ లాక్.. గణేష్ ఉత్సవాలు థియేటర్లో..!

Mass Jathara..టైర్ -1 హీరోలలో ఒకరిగా పేరు సొంతం చేసుకున్న మాస్ మహారాజా రవితేజ (Raviteja) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో.. విలక్షణ నటుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ అందుకున్నారు. ఇప్పుడు ఏడుపదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన.. తాజాగా ‘మాస్ జాతర’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. భాను భోగవరపు (Bhanu Bhogavarapu) దర్శకత్వంలో శ్రీ లీలా(SreeLeela ) హీరోయిన్గా, రవితేజ హీరోగా వస్తున్న ఈ చిత్రం విడుదల కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ.. మేకర్స్ పోస్టర్ తో సహా తెలియజేయడమే కాకుండా అటు హీరో రవితేజ కూడా తన ఇంస్టాగ్రామ్ వేదికగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు.


‘మాస్ జాతర’ రిలీజ్ డేట్ లాక్..

మాస్ జాతర సినిమా వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27న విడుదల కానుంది. రవితేజ నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. వింటేజ్ వైబ్స్, కమర్షియల్ హంగులతో థియేటర్లలో మాస్ పండుగను తీసుకురానుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన పాటలు, పోస్టర్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. ఈ సినిమా నుండి విడుదలైన మొదటి జీతంతో ‘తూ మేరా లవర్’ పాట అందరిని ఉర్రూతలూగించింది. ‘ఇడియట్’ సినిమాలోని ‘చూపులతో గుచ్చి గుచ్చి చంపకే’ పాటకు ట్రిబ్యూట్ గా మలిచిన ‘తూ మేరా లవర్’ గీతం అభిమానులకు విందు భోజనంలా అనిపించింది. ఇందులో శ్రీ లీల అదరగొట్టేసింది. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ‘ధమాకా’ సినిమా మంచి విజయాన్ని అందుకోగా.. ఇప్పుడు మరొకసారి బాక్సాఫీస్ వద్ద మెరుపులు మెరిపించడానికి సిద్ధమవుతున్నారు.


ఈసారి గణేష్ ఉత్సవాలు థియేటర్లలో..

ధమాకా సినిమాకు సంగీతాన్ని అందించిన భీమ్స్ సిసిరోలియో మరోసారి సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యారు. కాకపోతే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ నిర్మాణ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ వినాయక చవితి సందర్భంగా థియేటర్లలో మాస్ పండుగను తీసుకొచ్చి అభిమానుల దాహాన్ని తీర్చడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాదు వినాయక చవితి ఉత్సవాలను థియేటర్లలో ఆగస్టు 27న జరుపుకుందాం అంటూ రవితేజ తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ఎదురుచూపుకు చిత్ర బృందం ఎట్టకేలకు తెరదించింది. ఇక ఈ సినిమా సాంకేతిక బృందం విషయానికి వస్తే.. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ గా విధు అయ్యన్న.. ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఫన్నీ కే వర్మ పనిచేస్తున్నారు. ఇక పీఆర్ఓగా లక్ష్మీ వేణుగోపాల్ వ్యవహరిస్తున్నారు. మొత్తానికైతే ధమాకాతో భారీ సక్సెస్ అందుకొని, ఇప్పుడు మళ్లీ అదే కాంబో ‘మాస్ జాతర’ అంటూ రాబోతోంది. మరి థియేటర్లలో ఎటువంటి మాస్ క్రియేట్ చేస్తారో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×