Vishwak Sen Movie : విశ్వక్ సేన్‌కు మొండిఘటం అనే పేరు ఇండస్ట్రీలో ఉంది. దానిలో ఎంత వరకు నిజం ఉందో తెలీదు కానీ, అప్పట్లో… సీనియర్ హీరో అర్జున్ సర్జా తో సినిమా క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఇది నిజమే అని ఓ ప్రచారం అయితే జరిగింది. ఇప్పుడు, ఈ రోజు… ఆ మొండిఘటం అప్పుడు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ అని అంటున్నారు క్రిటిక్స్.
అందుకు కారణం… నిన్న రాత్రి రిలీజ అయిన సీతా పయనం మూవీ టీజర్. ఈ టీజర్ గురించి, ఆ సినిమా గురించి, హీరో, హీరోయిన్‌ల గురించి మాట్లాడే ముందు… 2022లో ఏం జరిగిన ఓ టాపిక్ గురించి మాట్లాడుదాం.
2022లో అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా, విశ్వక్ సేన్ హీరోగా ఓ మూవీ స్టార్ట్ అయింది. దీనికి అర్జున్ సర్జానే డైరెక్టర్. ఈ మూవీ పూజా కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా కూడా వచ్చాడు. అందుకే ఈ సినిమా అప్పుట్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా అయిపోయింది.
అంతా సక్రమంగా నడుస్తుంది అని అనుకునే సమయంలో… అర్జున్ సర్జా ఓ ప్రెస్‌మిట్ పెట్టి.. విశ్వక్ సేన్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. నటుడిగా అసలు పనికి రాడు అంటూ కామెంట్స్ చేశాడు. దానికి విశ్వక్ కూడా వివరణ ఇచ్చుకున్నాడు. డామినేషన్ ఉంది కాబట్టే తప్పుకున్నా.. అంటూ కామెంట్ చేశాడు.
అక్కడితో ఆ వివాదం ముగిసింది. కానీ, ఇప్పుడు సీతా పయనం మూవీ టీజర్ వచ్చిన తర్వాత ఆ వివాదం గుర్తొస్తుంది. అంతే కాదు.. అప్పుడు విశ్వక్ తప్పుకోవడంపై ఇప్పుడు చర్చ జరుగుతుంది.
ఇప్పుడు సీతా పయనం మూవీ టీజర్ గురించి మాట్లాడితే… ఇది అవుట్ అండ్ అవుట్.., హీరోయిన్ బేస్ మూవీ. హీరో జస్ట్ సపొర్ట్ రోల్ గా మాత్రమే ఉండేలా ఉందని టీజర్ చూస్తే అర్థమైపోతుంది. సినిమా ఒక వేళ సక్సెస్ అయినా… హీరోకు వచ్చే మార్కులేం ఉండవని కూడా తెలిసిపోతుంది.
అలాంటి సినిమాలో విశ్వక్ సేన్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న హీరోని ఆడియన్స్ ఊహించుకోలేరు. విశ్వక్ కూడా అలానే అనుకోని ఉంటాడు. అందుకే మూవీ నుంచి తప్పుకున్నాడు అంటూ ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా.. ఆ మూవీ నుంచి విశ్వక్ తప్పుకోవడం వల్ల… అటు సినిమాకు, ఇటు విశ్వక్ కు మంచే జరిగింది అనే అభిప్రాయాలు వస్తున్నాయి.
కాగా, విశ్వక్ సేన్ తప్పకోవడంతో.. ఆ.. ప్లేస్‌లో డెబ్యూ హీరో ప్లేస్‌లో కన్నడ స్టార్ హీరో ఉపెంద్ర అన్న కొడుకు నిరంజన్‌ను తీసుకున్నారు. నిన్న ఈవెంట్ పెట్టి… టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ కి డైరెక్టర్ సుకుమార్, హీరో ఉపెంద్ర చీఫ్ గెస్ట్ లుగా కూడా వచ్చారు.