BigTV English

#RT75: మాస్ మహారాజాతో మరోసారి శ్రీలీల రొమాన్స్.. డబుల్ ధమాకా

#RT75: మాస్ మహారాజాతో మరోసారి శ్రీలీల రొమాన్స్.. డబుల్ ధమాకా

Sreeleela with Ravi Teja in #RT75: విజయాపజయాలను పట్టించుకోకుండా వరుస సినిమాలతో బిజీగా మారాడు మాస్ మహారాజా రవితేజ. ఈ  ఏడాది ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఇక ఈసారి మాత్రం కచ్చితంగా హిట్ అందుకొనే స్టఫ్ తోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం రవితేజ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.


ఒకటి హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ ఒకటి. వీరి కాంబోపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ఇది కాకుండా క్రాక్ కాంబో గోపీచంద్ మలినేనితో ఒక సినిమా అనౌన్స్ చేశాడు కానీ, అది మధ్యలోనే ఆగిపోయిందని తెలుస్తోంది. ఈ రెండు కాకుండా రవితేజ నటిస్తున్న మరో చిత్రం RT75. సామజవరాగమన సినిమాతో మంచి హిట్ అందుకున్న డైరెక్టర్ భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. రవితేజ – శ్రీలీల ఇప్పటికే ధమాకా సినిమాలో నటించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత శ్రీలీల మరో హిట్ అందుకున్నది లేదు. అంతకుముందున్న జోరు ఇప్పుడు ఆమెలో కనిపించడం లేదు. వరుస సినిమాలు ప్లాప్స్ అవ్వడంతో కొద్దిగా గ్యాప్ తీసుకొని ఆచితూచి అడుగులు వేస్తుందని తెలుస్తోంది.


Also Read: Actress Sunaina: అమ్మోరు సినిమాలో అమ్మవారుగా నటించిన ఈ చిన్నారి.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమాపై శ్రీలీల ఆశలు పెట్టుకున్నదని తెలుస్తోంది. నిజం చెప్పాలంటే ఇది శ్రీలీలకు మంచి అవకాశం. అంతా హిట్ కాంబోనే కబాడంతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగుతుంది. మరి మాస్ మహారాజా సంక్రాంతి మొగుడు అవుతాడో లేదో చూడాలి.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×