Rajamouli: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు, పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి (S.S.Rajamouli ) పై ఆర్సీబీ అభిమానులు (RCB Fans)తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా భారీగా విమర్శలు కురిపిస్తున్నారు. సాధారణంగా రాజమౌళి ఏ విధమైనటువంటి వివాదాలు జోలికి వెళ్ళరు. అదేవిధంగా ఈయన ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయరు. ఏ విషయం గురించి మాట్లాడిన ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఇప్పటివరకు ఎలాంటి వివాదాలలో చిక్కుకోని రాజమౌళి పై విమర్శలు రావడానికి గల కారణం ఏంటనే విషయాన్ని వస్తే…
మండిపడుతున్న ఆర్సీబీ అభిమానులు…
జూన్ మూడో తేదీ ఐపీఎల్ ఫైనల్ జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఈ ఫైనల్స్ లో పోటీపడ్డాయి. కొంతవరకు ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరిగిన చివరికి విజయం ఆర్సీబీదే అని తేలిపోవడంతో అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఆర్సీబీ జట్టుకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక విరాట్ అభిమానుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 18 ఏళ్ల కల ఇప్పుడు సహకారమైంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదంతా బానే ఉన్నప్పటికీ రాజమౌళి పై ఆర్సీబీ ఫాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం లేకపోలేదు.
కప్పు అందుకోవటానికి అర్హులు …
ఐపీఎల్ మ్యాచ్ జరగడానికి ముందుగా రాజమౌళి సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఫైనల్స్ లో పోటీ పడిపోతున్న ఈ రెండు జట్ల గురించి ఈయన ట్వీట్ చేశారు. ఈ ఫైనల్ మ్యాచ్లో కప్ అందుకోవటానికి శ్రేయాస్ అయ్యర్ పూర్తిస్థాయిలో అర్హుడు. దాదాపు 11 సంవత్సరాలు తర్వాత శ్రేయాస్ పంజాబ్ జట్టును ఫైనల్స్ వరకు తీసుకువెళ్లారు అంటూ శ్రేయస్ గురించి చెప్పుకు వచ్చారు. అదేవిధంగా విరాట్ కోహ్లీ గురించి కూడా ఈయన తెలిపారు. విరాట్ కోహ్లీ కూడా ఎంతో కష్టపడటమే కాకుండా వేల సంఖ్యలో రన్నులు చేస్తూ విజయం చివరి అంచులకు వచ్చారు. ఈ కప్పు గెలుచుకోవడానికి విరాట్ కోహ్లీ కూడా పూర్తిస్థాయిలో అర్హుడని తెలిపారు.
Iyer guiding Bumrah’s and Boult’s yorkers to the third man boundary… Exquisite…
This man leads Delhi to a final… and is dropped…
Leads Kolkata to a trophy… dropped…
Leads a young Punjab to the finals after 11 years.
He deserves this year’s trophy too…On the other hand,… pic.twitter.com/ws0anhcZ3l
— rajamouli ss (@ssrajamouli) June 2, 2025
ఇలా ఈ ఇద్దరి గురించి రాజమౌళి ఈ విధమైనటువంటి పోస్ట్ చేయటమే కాకుండా… ఈ ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలిచినా హృదయ విదారకంగా ఉంటుంది అంటూ కన్నీటి కార్చుతున్న ఒక ఎమోజిని షేర్ చేశారు. ఒక జట్టు విజయం సాధిస్తే మరొక టీం బాధపడుతుందన్న ఉద్దేశంతో ఈ పోస్ట్ చేశారు. ఇక ఈ ఫైనల్ పూర్తి అయ్యి ఆర్సీబీ విజయం సాధించిన తర్వాత రాజమౌళి ఈ విజయం గురించి ఒక ట్వీట్ కూడా వేయకపోవడంతో ఆర్సీబీ అభిమానులు రాజమౌళి పై విమర్శలు చేస్తున్నారు. మీరు పూర్తిస్థాయిలో మద్దతు శ్రేయాస్ అయ్యర్ కి తెలిపారని, అందుకే ఆర్సీబీ గెలిచిన విష్ చేస్తూ ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు అంటూ అభిమానులు భారీ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఇక రాజమౌళి సినీ విషయానికి వస్తే RRR సినిమాతో ఆస్కార్ అవార్డు కొట్టిన ఈయన ప్రస్తుతం మహేష్ బాబుతో మరో పాన్ ఇండియా సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.