BigTV English

KCR: ఎట్లుంటివి కేసీఆర్.. ఎట్లైతివి?

KCR: ఎట్లుంటివి కేసీఆర్.. ఎట్లైతివి?

KCR: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. ఒకప్పుడు స్టేట్ ఫార్మేషన్ డే అంటే కేసీఆర్ జోష్ ఉండేది. వేడుకల్లో హుషారుగా పాల్గొనేవారు. ఆయన జోర్దార్‌గా వ్యవహరించేవాడు. తెలంగాణ అంటే నేను.. నేను అంటే తెలంగాణ అనే చెప్పుకునే గులాబీ బాస్ కు ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ సప్పుడులేదు. పదవి పోగానే ఫాంహౌజ్‌కు పరిమితమయ్యారు కేసీఆర్. కవిత లేఖ, ఆ తర్వాత జరిగిన తతాంగం నేపథ్యంలో.. కేసీఆర్ బయటకు వస్తారు..! ఏదైనా మాట్లాడుతారు..! పార్టీ నిర్ణయాలను ప్రజలకు వివరిస్తారు..! కొత్త విషయాలు చెబుతారు..! అని పార్టీ సీనియర్ నాయకులతో పాటు.. అటు కేడర్ ఇటు తెలంగాణ ప్రజలు భావించారు. అయితే వాటిన్నింటికి.. ఫామ్ హౌస్ నుంచి బయటకు రాకుండా KCR పెద్ద పులిస్టాప్ పెట్టేశారు.


⦿ ఎవరికి వారే యమునా తీరే..

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల వేళ బీఆర్ఎస్ కీలక నేతల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు అయిపోయింది. తెలంగాణ తెచ్చిందే నేను అని చెప్పుకునే కేసీఆరూ.. అసలు వేడుకల్లోనే పాల్గొనలేదు. ఓ పక్క పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫారిన్ టూర్ కు వెళ్లారు. ఇక కవిత జాగృతి ఆఫీసులో సొంతంగా వేడుకలు నిర్వహించారు. ఒక్క హరీష్ రావు తప్ప.. కేసీఆర్ ఫ్యామిలీలోని ఏ ఒక్కరూ తెలంగాణ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవతరణ దినోత్సవాల్లో పాల్గొనలేదు. కొందరు అడపాదడపా నేతలు మాత్రమే పాల్గొన్నారు.


ALSO READ: తెలంగాణ ఉద్యమ రియల్ హీరోలే వీళ్లే..

⦿ ఏడ పోయినవ్ కేటీఆర్

పార్టీ చీఫ్ గా కేసీఆర్ వేడుకులకు రాకుంటే.. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్ నేతృత్వంలో ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహించేవారు. కానీ, కేటీఆర్ ఈసారి రాష్ట్రంలో ఉండకుండా.. అమెరికా, ఇంగ్లండ్ టూర్‌లో బిజీ అయిపోయారు. ఇంగ్లండ్ టూర్‌ను ముగించుకుని.. ఇప్పుడు అమెరికాలో పర్యటిస్తున్నారు. డల్లాస్ లో అక్కడి ఎన్ఆర్ఐలు నిర్వహించిన బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో.. అలాగే ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ కోసం పోరాడుతున్నామని చెబుతున్నా.. రాష్ట్రంలో మాత్రం అవతరణ వేడుకల్లో పాల్గొనకపోవడం ఏమిటని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది.

ALSO READ: వావ్.. హైదరాబాద్ ఇలా కానుందా..?

⦿ కవిత రూటే వేరు..

కొన్ని రోజులుగా బీఆర్ఎస్‌ పార్టీతో కవిత అంటిపెట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత కవిత రాష్ట్రంలో సంచలన సృష్టించింది. గులాబీ పార్టీలో సొంత అన్న కేటీఆర్, బావ హరీష్ రావులను టార్గెట్ చేస్తూ.. విమర్శలు చేశారు. ఈ కారణంగా పార్టీ కేడర్ తనను దగ్గరకు రానివ్వడం లేదన్న చర్చ జరుగుతున్నది. కనీసం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు అయినా.. కవిత తెలంగాణ భవనకు వస్తారని అందరూ ఊహించుకున్నారు. కానీ ఆమె జాగృతి ఆఫీసులో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. అనంతరం జాగృతి ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో పాల్గొన్నారు.

⦿ కేసీఆర్ మౌనంగా ఉంటే ఎవరికీ మైనస్

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి జాతీయ జెండాను ఎగురువేశారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావుతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. కానీ పార్టీ చీఫ్ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, లేకపోవడంతో కేడర్ కొంత నిరాశకు లోనైట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడే వేడుకలా..? అధికారంలో లేనప్పుడు దాని ఊసే అవసరం లేదా? అని రాష్ట్ర వ్యాప్తంగా పలువురు జోరుగా చర్చించుకుంటున్నారు. కేసీఆర్ మౌనంగా ఉంటే.. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ మైనస్ అవుతోందని మాట్లాడుకుంటున్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×