BigTV English
Advertisement

Prabhas in Kannappa Sets: బ్రేకింగ్.. కన్నప్ప సెట్ లో అడుగుపెట్టిన ప్రభాస్..!

Prabhas in Kannappa Sets: బ్రేకింగ్..  కన్నప్ప సెట్ లో అడుగుపెట్టిన ప్రభాస్..!

Hero Prabhas Joined in Manchu Vishnu’s in Kannappa Sets: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న చిత్రం కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు మోహన్ బాబు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో విష్ణు సరసన ప్రీతి ముఖుందన్ నటిస్తుంది.


ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అన్ని ఇండస్ట్రీల హీరోలు నటిస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, శివన్న.. ఇలా అతిరథ మహారధులు నటిస్తున్నారు. ఇప్పటికే శివుని పాత్రలో అక్షయ్ కుమార్ నటిస్తున్నట్లు తెలిసిపోయింది. మొదటి నుంచి శివుని పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడని అనుకున్నారు. కానీ శివుని పాత్రలో కాకుండా నందీశ్వరుడుగా ప్రభాస్ కనిపించనున్నట్లు టాక్ నడుస్తోంది.

ఇక తాజాగా ప్రభాస్.. కన్నప్ప సెట్ లో అడుగుపెట్టాడు. ఈ విషయాన్నీ మేకర్స్ అధికారికంగా తెలిపారు. ప్రభాస్ కాలును చూపిస్తూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. దానికి విష్ణు ఒక మంచి క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు. మై బ్రదర్ ప్రభాస్ కన్నప్ప సెట్ లో అడుగుపెట్టాడు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.


Also Read: Suriya Daughter Dia: ఇంటర్ రిజల్ట్స్ లో అదరగొట్టిన సూర్య-జ్యోతిక కూతురు..

ఇక అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ చాలా తక్కువ సమయమే కనిపించనున్నాడట. మంచు విష్ణు మీద ఉన్న అభిమానంతో డార్లింగ్ ఈ సినిమాలో చేయడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. అన్ని భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కు సిద్దమవుతుంది. మరి ఈ సినిమాతో మంచు విష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×