Tollywood : సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు సినిమాలు వరుసగా హిట్ అయ్యేవి. అయితే అప్పట్లో రెమ్యూనరేషన్ కన్నా ముందు సినిమాలు హిట్ అయితే బాగుండు అని హీరోలు భావించే వాళ్ళు. అదే విధంగా స్టోరీలను ఎంపిక చేసుకొనే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకొని మరీ సినిమాలు చేసేవారు. కానీ ఈమధ్య హీరోల రేంజ్ పెరగడంతో రెమ్యూనరేషన్ కూడా బాగా పెరిగింది. అయితే సినిమాలు మాత్రం గతంలో లాగా బ్లాక్ బస్టర్ అవడం కాదు కనీసం హిట్టు కూడా అవడం లేదని ఓ వాదన సోషల్ మీడియాలో వినిపిస్తుంది. రెమ్యునరేషన్ భారీగా తీసుకున్న కూడా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. ఒకవైపు ఫ్లాక్ మూవీలు ఆ హీరో ఖాతాలో ఉన్న సరే మీరు మాత్రం కచ్చితంగా హిట్ కొడతామని నమ్మకంతో కోట్లు ఖర్చు పెడుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో ఎన్ని కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
ఏ హీరోకు ఎన్ని కోట్ల రెమ్యూనరేషన్..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు కొదవలేదు.. ఇప్పటికీ ఎంతోమంది స్టార్ హీరోలు తమ స్టార్ని కొనసాగిస్తూ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అలాంటి వారిలో నందమూరి బాలయ్య ఒకరు. ఈయన మొదట్లో 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఈ మధ్య బాలయ్య ఖాతాలో వరస హిట్ సినిమాలు పడటంతో రెమ్యూనరేషన్ త్రిబుల్ అయింది. ప్రస్తుతం బాలయ్య 30 కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి అయితే ఏకంగా 75 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇక తమిళ స్టార్ హీరో ధనుష్ 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. శివ కార్తికేయన్, నాని 30 కోట్ల వరకు పారితోషికాన్ని అందుకుంటున్నారు. రవితేజ 25 కోట్లు, సిద్దు జొన్నలగడ్డ 15 కోట్లు, విశ్వక్సేన్ ఆరు కోట్లు, శ్రీ విష్ణు ఐదు కోట్లు, శర్వానంద్ 10 కోట్లు, కళ్యాణ్ రామ్ 8 కోట్లు, సందీప్ కిషన్ మూడుకోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారు.
Also Read :సక్సెస్ ఫుల్ హీరోతో మిడ్ నైట్ పార్టీలు.. కానీ వీళ్లకు మాత్రం డిజాస్టర్..
నీళ్లలాగా ఖర్చు చేస్తున్న నిర్మాతలు..
అయితే సినిమా చేస్తున్న హీరోలతో పాటు, అటు స్టార్ట్ డైరెక్టర్లు కూడా భారీగానే కోట్లలో రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నారు. ఒక సినిమా తీయాలంటే నిర్మాతకు నిర్మాణ వ్యయం కన్నా ముందు హీరోలకు, దర్శకులకే ఎక్కువ డబ్బులు పెడుతున్నాడు. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే. డైరెక్టర్ల రెమ్యూనరేషన్ చూసి అటు సినిమాటోగ్రాఫర్లు, టెక్నీషియన్లు కూడా భారీగా డిమాండ్ చేస్తున్నట్లు ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇక నిర్మాతలు చేసేదేమీ లేక ఏదో ఒక ప్రాజెక్ట్ ని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని అన్నిటికీ ఒప్పుకుంటూ భారీగా ఖర్చు పెడుతూ సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే ఈమధ్య భారీగా బడ్జెట్ పెట్టిన సినిమాలు సైతం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవుతున్నాయి. హిట్ సినిమాలు ఉన్న హీరోకు రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చిన పర్వాలేదు సినిమా హిట్ అయితే బాగుండు అని నిర్మాతలు అనుకోవడం లేదు. కొన్నేళ్లుగా తమ ఖాతాలో ఫ్లాక్ సినిమాలో ఉన్నా కూడా ఆ హీరోల వెనకాలే నిర్మాతలు పడడం వెనుక అర్థం ఏంటి? తప్పు ఎవరిది అనేది ఇక్కడ ప్రశ్నార్ధకంగా మారింది. ఈ సమస్యకు పరిష్కారం ఇప్పట్లో కనిపించేలా లేదు. చూద్దాం ముందు ముందు ఎలాంటి సినిమాలు వస్తాయో..