OTT Movie : ఓటిటిలో ఇప్పుడు వెబ్ సిరీస్ లు సందడి చేస్తున్నాయి. ఎటువంటి కంటెంట్ కావాలన్నా, వీటిలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ హారర్ జానర్ లో వచ్చింది. ఒక హాస్టల్లో ఉండే గదిలో రాత్రి పూట, వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో, అందులో ఉండటానికి ఒక అమ్మాయి వస్తుంది. అప్పుడే అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘ఖౌఫ్’ (Khauf). 2025 లో విడుదలైన ఈ సిరీస్ ను స్మితా సింగ్ రచించగా, పంకజ్ కుమార్, సూర్య బాలకృష్ణన్ దర్శకత్వం వహించారు. ఇందులో మోనికా పన్వార్, రజత్ కపూర్, గీతాంజలి కులకర్ణి, శిల్పా శుక్లా వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ కథ దిల్లీలోని ఒక మహిళల హాస్టల్‌లో జరుగుతుంది. ఇది హారర్ జానర్ లో తెరకెక్కింది. ఎనిమిది ఎపిసోడ్స్ తో ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
గ్వాలియర్ నుండి ఢిల్లీకి మధు అనే యువతి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు వస్తుంది. ఆమె ఒక విమెన్స్ హాస్టల్‌లో రూమ్ 333లో ఉండటానికి చేరుతుంది. అయితే, ఈ గది లో భయంకరమైన సంఘటనలు జరిగాయని, దానిలో ఒక దెయ్యం ఉందని హాస్టల్‌లోని ఇతర మహిళలు ఆమెను హెచ్చరిస్తారు. మధు ఇదివరకే లైంగిక వేధింపుల బారిన పడిఉంటుంది. ఆమె ఈ గదిలో ధుష్ట శక్తులతో పాటు తన మానసిక గాయాలతో కూడా పోరాడాల్సి వస్తుంది. హాస్టల్‌లోని ఇతర మహిళలు, వాళ్ళ సొంత సమస్యలతో ఇక్కడ నుంచి బయటకి వెళ్లలేక పోతారు. వారి స్నేహితురాలు విక్కీ అక్కడే చనిపోవడంతో, ఆమె ఆత్మ వారిని వెంటాడుతోందని వారు భయపడుతుంటారు.
మరోవైపు హకీమ్ అనే వ్యక్తి మంత్రాలతో మధులోని ఆత్మను, తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలనుకుంటాడు. మధు తన గతంలోని భయాలను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తూ, తనను వేధించిన వ్యక్తిని గుర్తించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. అదే సమయంలో, హాస్టల్‌లోని ఇతర మహిళలు హకీమ్‌తో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇది మరింత గందరగోళానికి దారితీస్తుంది. ఇక మధు శరీరంలో అతీంద్రియశక్తులు రావడంతో, తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. చివరికి మధు తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుందా ? ఆమె ఉన్న గదిలో ఎటువంటి సంఘటనలు జరుగుతాయి? హాస్టల్‌లో ఉండే మిగతా మహిళలు ఎందుకు అక్కడే ఉండాల్సి వస్తుంది ? ఈ విషయాలను తెలుసుకోవాలి అంటే, ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను మిస్ కాకుండా చూడండి.
Read Also : ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఊహించని ట్విస్ట్ … మర్డర్ మిస్టరీ తో మైండ్ బ్లాక్ చేసే మూవీ