E-Paper
Advertisement

Renu Desai: సెకండ్ మ్యారేజ్.. రేణూ దేశాయ్ క్లారిటీ.. ఎప్పుడంటే..?

Renu Desai: సెకండ్ మ్యారేజ్.. రేణూ దేశాయ్ క్లారిటీ.. ఎప్పుడంటే..?
Advertisement

Renu Desai: రేణు దేశాయ్.. తెలుగు ప్రేక్షకులకు, పవన్ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. బద్రి మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన రేణు ఆ తరువాత పవన్ కళ్యాణ్ ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది. బద్రి, జానీ మూవీలలో హీరోయిన్ గా నటించినప్పటికీ.. ఆమెను ఇప్పటికీ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే అందరికీ సుపరిచితం. ఇద్దరూ విడాకులు తీసుకొని సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ తరచూ రేణు దేశాయ్ పవన్ కు సంబంధించి ఏదో ఒక రకంగా వివాదాల్లో వైరల్ అవుతూనే ఉంటుంది.

పెళ్లయిన తర్వాత సినీ కెరియర్ కు లాంగ్ గ్యాప్ తీసుకున్న రేణు ఆ తరువాత కొన్ని టీవీ షోస్ లో సందడి చేశారు. రీసెంట్గా స్టువర్టుపురం టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రవితేజ హీరోగా నిర్మించిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఒక సంఘసంస్కర్త పాత్రలో రేణు నటించారు. పవన్ రేణు దేశాయికి అకీరా, ఆద్య అని ఇద్దరు పిల్లలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. పెళ్లయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అన్యోన్యంగా గడిపిన ఈ జంట తర్వాత విభేదాల కారణంగా డైవర్స్ తీసుకున్నారు. ఇందుకుగాను పవన్ రేణు కి పెద్ద మొత్తాన్ని ముట్ట చెప్పాడు.

Advertisement

అప్పటినుంచి రేణు తన పిల్లలతో ఒంటరిగా నివసిస్తోంది. ఆరేళ్ల క్రితం ఒక సందర్భంలో రేణు దేశాయ్ రెండవ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. డైవర్స్ అయినప్పటికీ అప్పటివరకు ఎంతో ప్రేమగా వదినమ్మ అని పిలుస్తున్న పవన్ ఫ్యాన్స్ దాంతో రేణుని ఏకిపారేశారు. అదిగో అప్పటినుంచి ఎప్పుడు వీలు దొరికినా పవన్ ఫాన్స్ రేణుని టార్గెట్ చేయడం పరిపాటిగా మారింది. ఇక ఎంగేజ్మెంట్ వరకు వచ్చిన రేణు రెండవ పెళ్లి తెలియని కారణాల వల్ల ఆగిపోయింది. అయితే పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడానికి కారణం పవన్ ఫ్యాన్స్ కామెంట్స్ అని అప్పట్లో టాక్.

23 సంవత్సరాల తరువాత తిరిగి రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వరరావు మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన సందర్భంగా ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు ఆమె పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె రెండవ పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. రెండవ పెళ్లి ఎందుకు చేసుకోలేదు అన్న విషయంపై రేణు స్పష్టత ఇవ్వడంతో పాటు త్వరలో తిరిగి పెళ్లికి సిద్ధం అనడం అందరిని షాక్ కి గురిచేసింది.

Advertisement

“పవన్ , నేను విడాకులు తీసుకునే సమయానికి అకిరా, ఆద్య చాలా చిన్న పిల్లలు. తల్లిగా వాళ్ళ బాధ్యత నాపై ఉంది. కుటుంబం, స్నేహితులు నన్ను రెండవ పెళ్లి చేసుకోమని సలహాలు ఇచ్చారు. నాకు తోడే కాదు, పిల్లలకు అండ కూడా అవసరమని చెప్పి నన్ను కన్విన్స్ చేశారు. మొదట్లో వాళ్ల మాటలు విని సరే అన్న నేను, పెద్దలు కుదిర్చిన పెళ్లికే సిద్ధపడ్డాను. ఎంగేజ్మెంట్ చేసుకున్నాక వాటికి సంబంధించిన ఫొటోస్ ని నేను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశాను. అయితే అప్పుడు ఆద్య వయసు కేవలం ఏడు సంవత్సరాలు మాత్రమే. ఆ సమయంలో పెళ్లి చేసుకుంటే తనతో ఎక్కువసేపు గడపలేనేమో అని అనిపించింది. ఆ వయసులో నా కూతురికి నా అవసరం చాలా ఉంది. అందుకే సింగిల్ పేరెంట్ గా నా పిల్లలు ఒక వయసుకు వచ్చేoతవరకు వాళ్లకు తోడుగా నిలవాలి అని భావించి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాను”అంటూ రేణు అసలు రీసన్ చెప్పుకొచ్చింది.

అంతేకాదండోయ్ ప్రస్తుతం ఆమె పిల్లలు ఎంతో మెచ్యూర్డ్ గా.. నీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకొని నువ్వు హ్యాపీగా ఉంటే చూడాలనుంది అని అంటున్నారట. అయితే ప్రస్తుతం ఆద్య కు 13 సంవత్సరాలు కాబట్టి ఇంకొక మూడేళ్ల తరువాత అంటే ఆద్యకు 16 సంవత్సరాలు వయసు వచ్చేసరికి తన రెండవ పెళ్లి గురించి ఆలోచిస్తాను అని రేణు దేశాయ్ అంది. కొందరు ఆమె తీసుకున్న నిర్ణయం కరెక్టే కదా అని అంటుంటే మరికొందరు పదహారేళ్ల కూతుర్ని పెట్టుకొని పెళ్లి పీటలు ఎక్కుతావా? జోక్ చేస్తున్నావా? అని కామెంట్స్ పెడుతున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×