BigTV English

Retro Twitter Review : ‘రెట్రో’ ట్విట్టర్ రివ్యూ… లవ్-వార్ వర్కౌట్ అయిందా..?

Retro Twitter Review : ‘రెట్రో’ ట్విట్టర్ రివ్యూ… లవ్-వార్ వర్కౌట్ అయిందా..?

Retro Twitter Review : తమిళ స్టార్ హీరో సూర్య, టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజ హెగ్డే జంటగా నటించిన లేటెస్ట్ మూవీ రైట్రో.. సూర్య గతేడాది కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. దాంతో ఇప్పుడు భారీ యాక్షన్ సినిమా రెట్రో తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. నేడు మే డే సందర్భంగా ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. తమిళంలో పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్వకత్వంలో రూపొందిన ఈ సినిమాలో జయరాం, జోజు జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు..కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ‘రెట్రో’ సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి.. తెలుగులో ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ రిలీజ్ చేస్తున్నారు. ఇవాళ థియేటర్ లోకి వచ్చిన ఈ సినిమా ఎలాంటి టాక్ని సొంతం చేసుకుందో.. సోషల్ మీడియా ద్వారా నేటిజన్లో ఏమని కామెంట్ చేస్తున్నారో? ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..


తమిళ స్టార్ హీరో సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేయడంలో సూర్య 100 శాతం కష్టపడతాడు.. రెట్రో మూవీ విషయానికొస్తే భారీ యాక్షన్ల తో అదిరిపోయింది. డైరెక్టర్ పర్ఫామెన్స్ వేరే లెవెల్.. పూజ హెగ్డే నటన కూడా సూర్యకు సమానంగా ఉంది. ఇక బీజిఎం గూస్ బంప్స్ తెప్పిస్తుందనే చెప్పాలి. ఇవన్నీ చాలా బాగున్నాయి సినిమా కూడా ఎక్సలెంట్ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు..

 

మూవీ స్టోరీ అదిరిపోయింది సినిమాకు ఇప్పుడే బుకింగ్స్ పెరిగిపోతున్నాయి. సూర్య ఖాతాలో మరో హిట్ పడినట్లేని మరొకరు ట్వీట్ చేశారు..

ప్రముఖ సినిమా రివ్యూవర్ ఉమైర్ సందు ట్విట్ చేశారు. అత్యుత్తమ ప్రదర్శనతో కూడిన కల్ట్ క్లాసిక్ పవర్ ప్యాక్డ్ చిత్రం. అతను బ్యాంగ్‌తో తిరిగి వచ్చాడు.. క్లాప్ వర్తీ డైలాగ్స్ & క్లైమాక్స్‌తో కూడిన క్రేజీ థ్రిల్లర్. చాలా కాలం తర్వాత పూజాహెగ్డేకి మొదటి హిట్ అందుతుంది. ఆమె కూడా చాలా బాగా నటించింది అని ట్వీట్ లో రాశారు.

ఇక ఈ రెట్రో సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో హీరో సూర్యకు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విష్ చేస్తూ.. సూర్యా అన్నా.. మీరు కార్తీక్ లాంటి గొప్ప డైరెక్టర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మీ ఇద్దరి కాంబోకు భారీ విజయం తప్పుదు. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందని టీం కి పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు..

సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ మూవీ రొమాంటిక్, గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీగా రూపొందింది. ఈ సినిమాకు టాప్ ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ వర్క్ చేయడం వల్ల బడ్జెట్ భారీగానే అయింది. ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చుల తో కలిపి ఈ సినిమాను సుమారుగా 70 కోట్ల తో పూర్తి చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.. ప్రస్తుతానికైతే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఏ సినిమాకు కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో తెలియాల్సి ఉంది…

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×