BigTV English
Advertisement

Brahmamudi Serial Today May 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌ను చూసిన కళ్యాణ్‌ – నిజం ఒప్పుకున్న  కావ్య

Brahmamudi Serial Today May 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజ్‌ను చూసిన కళ్యాణ్‌ – నిజం ఒప్పుకున్న  కావ్య

Brahmamudi serial today Episode: నేనేం చెప్పకుండానే ఆయన తన ఇంటికి వచ్చాడు. నన్ను కలవడానికి ఏదో ఒక వంకతో ప్రతి రోజు ఫోన్‌  చేసి వస్తున్నాడు. నువ్వు ఎంతో కష్టపడి తన చుట్టు అల్లిన ఒక కట్టుకథ కథలాగానే మిగిలిపోయింది అని చెప్పగానే అలా ఎప్పటికీ జరగదు రాజ్‌ నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు అని యామిని చెప్తుంది. దీంతో కావ్య ఇంత జరుగుతున్నా..? నీకు ఇంకా అర్థం కాలేదా..? యామిని ఆయన మనసు ఎప్పుడో మారిపోయింది. ఇక మిగిలింది ఆయనకు గతం గుర్తుకు రావడమే.. అంటుంది. దీంతో అది ఎప్పటికీ జరగనివ్వను అంటుంది యామిని.. జరిగేలా నేను చేస్తాను అంటుంది కావ్య.


దీంతో యామిని మా పెళ్లికి రాజ్‌ కూడా ఒప్పుకున్నాడు. పెళ్లికి అన్ని రెడీ అవుతున్నాయి. ముహూర్తం గురించి అడిగితే నా ఇష్టమే తన ఇష్టం అన్నాడు. నువ్వేమో రాజ్‌ ఇంకా నీ భర్త అని అనుకుంటున్నావు. నీ మెడలో ఉన్న తాళి త్వరలోనే తెగిపోతుంది అంటూ యామిని చెప్పగానే.. సరే నువ్వనుకున్నదే నిజం అనుకుందాం. ఆయన పెళ్లికి ఒప్పుకున్నాడు అనుకుందాం. మరి నీతో ఉండాల్సిన మనిషి నాతో ఇలా రెస్టారెంట్‌ లో కలిసి కాఫీ తాగడానికి ఎందుకు వచ్చారు. నీతో పెళ్లి పనుల్లో బిజీగా ఉండాల్సిన మనిషి నాకోసం చీర కొనుక్కుని నన్ను వెతుక్కుంటూ మా ఇంటికి ఎందుకు వస్తాడు అంటుంది కావ్య. దీంతో అంటే నువ్వు అడిగితే నాతో పెళ్లి క్యాన్సిల్‌ చేసుకుంటాడు అంటావా అని యామిని అనగానే.. అలా చేయాలనుకుంటే ఎప్పుడో చేసేదాన్ని.. కానీ అలా చేయను ఆయన మనసులో నేను ఉన్నాను. అదే ఆయనకు గతం గుర్తు చేస్తుంది అంటూ కావ్య నవ్వగానే.. యామిని కోపంగా నవ్వుకో.. ఇదే నీకు చివరి నవ్వు ఇక నువ్వు నవ్వుకునే టైం లేదు అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది.

కళ్యాణ్‌ బైకు మీద వెళ్తుంటే కారులో వెళ్తున్న రాజ్‌ వచ్చి డాష్‌ కొడతాడు. ఇంతలో రాజ్‌ ఏంటి తమ్ముడూ చూసుకోవాలి కదా..? అంటూ చెప్పగానే.. కళ్యాణ్‌ సారీ బ్రో అంటూ రాజ్‌ను చూస్తాడు. అన్నయ్యా అంటూ బైక్‌ స్టార్ట్‌ చేసుకుని వెళ్లలోగా రాజ్‌ వెళ్లిపోతాడు. ఇంతలో కళ్యాణ్‌ను ట్రాఫిక్‌ ఫోలీస్‌ వచ్చి ఆపి ఆర్‌సీ, లైసెన్స్‌ అడుగుతాడు. కళ్యాణ్‌ పోలీస్‌తో ఆర్గ్యూ చేస్తాడు. తర్వాత ఇంటికి వెళ్లి సంతోషంగా అందరినీ పిలుస్తాడు. అప్పు వచ్చి ఏమైంది కూచి అని అడుగుతుంద. దీంతో కళ్యాణ్‌ చెప్తా పొట్టి ఇలాంటి విషయాలు ఒకరిద్దరికి చెప్పేవి కావు. అందరూ వినాలి. నాన్నమ్మ తాతయ్య అందరూ రండి అని పిలుస్తాడు. ఇంతలో ప్రకాష్‌ ఏంట్రా ఏదైనా మంచి సినిమాలో పాటలు రాసే అవకాశం వచ్చిందా ఏంటి అని అడుగుతాడు. అంతకన్నా పెద్ద గుడ్‌ న్యూస్‌ నాన్న  అంటాడు కళ్యాణ్‌.


నీకు అంతకన్నా పెద్ద గుడ్‌న్యూస్‌ ఏంట్రా అని సుభాష్‌ అడుగుతాడు. చెప్తా పెద్దనాన్న.. నాన్నమ్మ, తాతయ్య త్వరగా రండి అని పిలుస్తాడు. అందరూ వస్తారు. ఓరేయ్‌ కళ్యాణ్‌ నువ్వు ఇప్పుడు ఎందుకు పిలిచావో త్వరగా చెప్పరా..? అనగానే.. చెప్తాను పెద్దమ్మ ఇన్ని రోజులు కావ్య వదిన చెప్తే మనం నమ్మలేదు కానీ అన్నయ్యా బతికే ఉన్నాడు నేను నా కళ్లతో చూశాను. అని చెప్పగానే.. అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ధాన్యలక్ష్మీ అనుకున్నాను కావ్య తర్వాత ఎవరా అనుకున్నాను. ఇప్పుడు నువ్వా..? అంటుంది. దీంతో కళ్యాణ్‌ లేదు అమ్మా నేను చూశాను అంటాడు. చూస్తే ఇంటికి తీసుకురాలేదేం అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. ఇంతలో కావ్య వస్తుంది. అదిగో వస్తుందిగా వెళ్లి తనతో చెప్పు తను నమ్ముతుంది అనగానే.. వదిన ఇన్నాళ్లు మీర చెప్తుంటే నమ్మలేదు కానీ ఇప్పుడు నమ్ముతారు వదిన ఎందుకంటే అన్నయ్యను నేను చూశాను అని చెప్తాడు.  కావ్య షాక్‌ అవుతుంది. దీంతో ఇందిరాదేవి, ధాన్యలక్ష్మీ ఇద్దరూ కలిసి కళ్యాణ్‌ను తిడతారు. దీంతో నిజంగా నేను అన్నయ్యను చూశాను ఆ దేవుడి మీద ఒట్టు అంటాడు. దీంతో సీతారామయ్య ఓరేయ్‌ కళ్యాణ్‌ నువ్వు ఆ మాట చెప్తుంటే.. పోయిన ప్రాణం లేచి వచ్చినట్టు అవుతుంది.

మళ్లీ అబద్దం అని చెప్పవు కదా..? అనగానే లేదు తాతయ్యా నేను నిజంగానే చూశాను. చూస్తే మరి ఇంటికి ఎందుకు తీసుకురాలేదు అని ధాన్యలక్ష్మీ అడుగుతుంది. తీసుకొచ్చే ప్రయత్నం చేశాను కానీ ఎందుకో అన్నయ్య నన్ను గుర్తు పట్టనట్టుగా వెళ్లిపోయాడు అని చెప్తాడు. దీంతో అపర్ణ నిజం చెప్తుంది. వాడు నన్ను కూడా గుర్తు పట్టలేదు అని చెప్తూ బాధపడతుంది. గుడిలో చేసిన అన్నదానం గురించి చెప్తుంది. దీంతో ఇందిరాదేవి కోపంగా ఇంత జరుగుతుంటే ఇన్ని రోజులు మాకెందుకు చెప్పలేదు అంటూ ఎమోషనల్‌ అవుతుంది. ప్రకాష్, ధాన్యలక్ష్మీ కూడా బాధపడతారు. మీరు మీరు మాట్లాడుకుంటే మధ్యలో మేం ఏమైపోయినట్టు అంటూ నిలదీస్తుంది. సీతరామయ్య వెంటనే వెళ్లి రాజ్‌ను ఇంటికి తీసుకొద్దాం పదండి అంటాడు. కావ్య ఇప్పుడు వద్దని ఆయన ఇప్పుడు ఒక నకిలీ కుటుంబం మధ్య నకిలీ బంధంతో అల్లుడి స్థానంలో ఉన్నారు. ఆయనకు గతం గుర్తుకు లేదు. ఆయన ఎవరో కూడా ఆయనకు తెలియదు. ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయన ఎక్కువ ఆలోచిస్తారు.

అది ఆయన ప్రాణాలకే ప్రమాదం అందుకే యాక్సిడెంట్‌ అయిన కొద్ది రోజులకే నేను ఆయన్ని చూసిన ఎవ్వరికీ ఏ విషయం తెలియకుండా దాస్తూ వచ్చాను అంటుంది. దీంతో అందరూ ఒక నిర్ణయానికి వస్తారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం రుద్రాణికి తెలియకూడదు అంటూ ధాన్యలక్ష్మీకి చెప్తారు. ఇంతలో రుద్రాణి, రాహుల్ వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఏం చెప్పద్దు నాకేం తెలియకూడదు అంటూ వస్తారు. అందరూ షాక్‌ అవుతారు. ఏం ధాన్యలక్ష్మీ నాకేం చెప్పకూడదు అని అడుగుతుంది. దీంతో రాజ్‌ ఎలాగూ లేడు కదా కళ్యాణ్‌ను అయినా కంపెనీ బాధ్యతలు తీసుకోమని చెప్పు అన్నారు. వాడికి ఇష్టం లేని పని నేను చెప్పను అంటున్నాను అదే విషయం అని ధాన్యలక్ష్మీ చెప్తుంది. అందరూ వెళ్లిపోతారు. తర్వాత ఇక్కడేదో జరుగుతుందని రాహుల్‌, రుద్రాణి అనుకుంటారు.

మరోవైపు రాజ్‌ కావ్య గురించి ఆలోచిస్తుంటే..యామిని వచ్చి ఇక్కడ కూర్చున్నావా అంటూ ఇవేంటో చెప్పుకో చూద్దాం అంటుంది. అంత తెలిస్తే నేను ఇలా ఎందుకు ఉంటాను నువ్వే చెప్పు అంటాడు రాజ్‌. ఇవి మన వెడ్డింగ్ కార్డ్స్‌ బావ అంటుంది యామిని రాజ్‌ షాక్‌ అవుతాడు.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Deepthi Manne: ‘జగద్ధాత్రి’ సీరియల్ హీరోయిన్‌ పెళ్లి సందడి షురూ.. హల్తీ ఫోటోలు వైరల్!

Illu Illalu Pillalu Today Episode: నర్మద, వేదవతి మధ్య గొడవ.. ధీరజ్ కు దిమ్మతిరిగే షాక్.. పారిపోయిన భాగ్యం..

Brahmamudi Serial Today November 6th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీ గురించి నింజ తెలుసుకున్న రాహుల్‌

GudiGantalu Today episode: బాలు, మీనా మాటలతో షాక్.. ప్రభావతికి టెన్షన్ టెన్షన్.. సుశీల రాకతో హ్యాపీ..

Nindu Noorella Saavasam Serial Today November 6th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ కడుపులో పిండాన్ని చంపలేమన్న చంభా

Intinti Ramayanam Today Episode: పల్లవిని అవమానించిన ఫ్రెండ్.. చక్రధర్ పై పల్లవి సీరియస్.. మీనాక్షికి షాక్..

Gundeninda Gudigantalu Prabhavathi : ప్రభావతిలో ఈ టాలెంట్ కూడా ఉందా..? కూతురు, కొడుకుతో కలిసే ఆ పని..

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న చిత్రాలు.. వాటిని మిస్ అవ్వకండి..

Big Stories

×