BigTV English
Advertisement

RGV – Sandeep Reddy vanga:సందీప్ మీద ఒట్టు.. బాక్స్ ఆఫీస్ షేక్ అవడం ఖాయం – వర్మ..!

RGV – Sandeep Reddy vanga:సందీప్ మీద ఒట్టు.. బాక్స్ ఆఫీస్ షేక్ అవడం ఖాయం – వర్మ..!

RGV – Sandeep Reddy vanga: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అయితే ఆయన బాటలోనే ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy vanga) కూడా నడుస్తున్నారు. ఒకప్పుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. ఆ తర్వాత ఆయన ‘క్షణక్షణం’, ‘రంగీలా’ వంటి సినిమాలతో ఫిలిం క్రిటిక్స్ కూడా నోరు మెదపలేదు అంటే, ఇక తన సినిమాలతో, ఇంకొకరు పేరు పెట్టకుండా అద్భుతంగా తెరకెక్కించారు వర్మ.


ఒకరిని మించి మరొకరు..

మరోవైపు ఈయన బాటలోనే నడుస్తున్నారు ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈయన డైరెక్షన్లో వచ్చిన అర్జున్ రెడ్డి ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇందులో రొమాంటిక్ సన్నివేశాలతో సినిమాని బాగా యూత్ కి కనెక్ట్ చేశారు. దీనికి తోడు ఇటీవల వచ్చిన యానిమల్ గురించి అయితే ఇక నోరు మెదపాల్సిన పనిలేదు. ఇందులో ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్గా నిలిచాయి.. అయితే యానిమల్ సినిమాపై కొంతమంది ఫిలిం క్రిటిక్స్ విమర్శలు గుప్పించినా.. తనదైన శైలిలో అందరి నోరు మూయించారు సందీప్ రెడ్డి వంగ.


యానిమల్ వర్సెస్ వైల్డ్ యానిమల్..

ఇకపోతే సందీప్ యానిమల్ అయితే వర్మ వైల్డ్ యానిమల్.. అలాంటి ఈ ఇద్దరు ఒకే స్టేజ్ పై కనిపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా వీరిద్దరి కి సంబంధించిన ఫుల్ ఇంటర్వ్యూ ఒకటి త్వరలోనే రాబోతోంది అని, అందుకు సంబంధించిన చిన్న ప్రోమో టైప్ వీడియోని విడుదల చేశారు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతా ద్వారా దీన్ని షేర్ చేయడంతో.. ఇద్దరు లెజెండ్రీ డైరెక్టర్స్ ఏం మాట్లాడుకోబోతున్నారు అనే విషయం తెలుసుకోవడానికి అభిమానులు సైతం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

వర్మ ట్వీట్ వైరల్..

ఇక వర్మ వీడియోని షేర్ చేస్తూ..యానిమల్ వర్సెస్ వైల్డ్ యానిమల్.. నేను,సందీప్.. బాహుబలి కంటే మంచి సినిమా తీయగలరా..? శివ వర్సెస్ అర్జున్ రెడ్డి.. రెండింటిలో ఏది బెటర్ అనే విషయంపై గ్లౌవ్స్ లేకుండా క్రూరమైన పోరాటం చేస్తున్నాము..పూర్తి ఇంటర్వ్యూ కోసం నవంబర్ 26వ తేదీ రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుంది అంటూ తెలిపారు వర్మ.

సందీప్ మీద ఒట్టు.. సరికొత్త మూవీతో రాబోతున్న వర్మ..

ఇకపోతే వర్మ షేర్ చేసిన ఆ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే.. సందీప్ రెడ్డి వంగ రాంగోపాల్ వర్మ ఒకే వేదికపై కనిపించారు. అదే సమయంలో రాంగోపాల్ వర్మ..సందీప్ ను ఉద్దేశించి.. బాహుబలి లాంటి సినిమా మూవీ మీరు తీయగలరా? అని ప్రశ్నించారు. ఆ తర్వాత రాంగోపాల్ వర్మ.. శివ, అర్జున్ రెడ్డి.. ఈ రెండింటిలో ఏది బెటర్ ? అని ప్రశ్నించారు.. ఆ తర్వాత సందీప్ మాట్లాడుతూ.. ఫిలిం క్రిటిక్స్ అందరి నోరు మూయించి.. సినిమా అంటే ఇది అని బాక్సాఫీస్ వద్ద నిలబెట్టిన చిత్రం రంగీలా అంటూ రాంగోపాల్ వర్మపై పొగడ్తల వర్షం కురిపించారు. అంతేకాదు ఫిలిం క్రిటిక్స్ అందరూ నోరు మూయాలి.. ముఖ్యంగా మీ నుంచి మరో బాక్స్ ఆఫీస్ భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాం సార్.. అంటూ సందీప్ అడగగా.. రాంగోపాల్ వర్మ..” సందీప్ మీద ఒట్టు.. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను.. ఈసారి బాక్స్ ఆఫీస్ కాదు రికార్డులు కూడా బ్రేక్ కావాల్సిందే”.. అంటూ కామెంట్ చేశారు వర్మ. మొత్తానికి అయితే వర్మ చేసిన ఈ కామెంట్స్ కి అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారని చెప్పవచ్చు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×