Long Hair Tips: పొడవుగా, అందంగా జుట్టు ఉండాలని ఏ అమ్మాయికి ఉండదు చెప్పండి. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు జుట్టు రాలే సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. దుమ్మూ, కాలుష్యం వల్ల చుండ్రు సమస్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి. పైగా శీతాకాలం.. ఈ సీజన్‌లో జుట్టు రాలిపోవడం, చుండ్రు ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇందుకోసం రకరకాల హెయిర్ ఆయిల్స్, సీరమ్స్, షాంపులు మొదలైనవి ఉపయోగిస్తుంటారు. వీటి వల్ల ఫలితం ఉంటుందో రాదో పక్కన పెడితే.. జుట్టుకు హానీకలిగే ప్రమాదం ఉంది. వీటివల్ల ఎక్కువ హెయిర్ ఫాల్ అవ్వచ్చు.
కాబట్టి మన ఇంట్లోనే నాచురల్‌గా హెయిర్ ఆయిల్ తయారు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందుకోసం మస్టర్డ్ ఆయిల్(ఆవాల నూనె) అద్బుతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఆవ నూనెలో విటమిన్ ఎ, ఇ, కాల్షియం, బీటా కెరోటీన్, ఐరన్ మొదలైనవి అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉండేందుకు ఉపయోగపడతాయి. ఆవ నూనె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జీర్ణ వ్యవస్థ, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌ల నుండి కాపాడుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న ఆవ నూనెలో మరికొన్ని పదార్ధాలు కలిపి జుట్టుకు అప్లై చేయండి. ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావాల్సిన పదార్ధాలు..
ఒక కప్పు ఆవనూనె
అర కప్పు నిగెల్లా విత్తనాలు(కలోంజి, లేదా బ్లాక్ సీడ్స్)
మూడు టేబుల్ స్పూన్ మెంతులు
తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో ఆవనూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు బ్లాక్ సీడ్స్, మెంతులు వేసి బాగా ముదురు రంగులో వచ్చేంత వరకు వేడి చేయండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి నూనెను కాసేపు ఆరనిచ్చి గాజు సీసాలో వడకట్టండి. అంతే సింపుల్ హోంమేడ్ హెయిర్ ఆయిల్ తయారు అయినట్లే..
Also Read: వీటితో.. ముఖం తెల్లగా మారుతుంది తెలుసా ?
జుట్టుకు ఇలా అప్లై చేయండి..
ఈ నూనెను జుట్టు కుదుళ్ల చివరి వరకు అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయండి. గంట తర్వాత లేదా రాత్రి పెట్టుకుని ఉదయం సాధారణ షాంపుతో తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు ఊడిపోకుండా.. ఒత్తుగా పెరుగుతుంది. చుండ్రు సమస్యలను దూరం చేయడంతో పాటు తెల్ల జుట్టును నివారిస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
బ్లాక్ సీడ్స్ ఉపయోగాలు..
నిగెల్లా విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు, విటమిన్ ఎ,బి, సి, బి12, ఫైబర్, ప్రొటీన్లు, కాల్షియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలకు, ఆరోగ్యానికి చాలా మంచిది. కలోంజి విత్తనాలను నీటిలో నానబెట్టుకుని తింటే జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అలాగే కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోను, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఇందులో కాన్సర్ నిరోధక గుణాలు కూడా ఉన్నాయి.
మెంతులు ఉపయోగాలు..
మెంతులు జుట్టు పెరుగుదలకు ఎంత మంచిదో ఆరోగ్యానికి కూడా అంతే మంచిది. మెంతులు నానబెట్టిన నీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మెంతులు, పెరుగు కలిపి జుట్టుకు అప్లై చేసిన చాలా మంచిది. జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది.