RGV : తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) ఏం మాట్లాడిన అది సంచలనమే.. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ డైరెక్టర్ ఇప్పుడు వరుస వివాదాలతో నిత్యం వార్తల్లో హైలెట్ అవుతుంటాడు. సమాజంతో పని లేకుండా బతికేస్తూ ఉంటాడు. ఇలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. సెలబ్రెటీలు ఒక ట్వీట్ చేయాలి అంటే వంద సార్లు ఆలోచించాలి.. ఏదైనా వివాదాలు వస్తాయా? అయిన మన పనేంటో మనం చూసుకుందాం అని అనుకుంటారు. వీలైనంతవరకు సినిమాల ముచ్చట్లు తప్ప వేరేవాటిలో తల దూర్చరు. కానీ వర్మ వివాదాలకు కేరాఫ్ గా ఉంటారు. ఆయన ఏమైనా ట్వీట్ చేయగలడు. ఆయన ఏ ట్వీట్ చేసినా జనాలు ఎంటర్‌టైన్ అవుతారే తప్ప ఆయన్ను విమర్శించేందుకు సాహసించరు.. తాజాగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి మరోసారి వార్తల్లో నిలిచాడు. అసలేం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం..
శారీ మూవీ..
టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రొడక్షన్‌లో LLP బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ(Ravi Shankar Varma) నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శారీ'(Saree).. వర్మ అసిస్టెంట్ గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహిస్తుండగా.. సత్య యాదు, ఆరాధ్య దేవీ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా నిజజీవిత సంఘటన ఆధారాలతో సైకాలజికల్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చాలా ఏళ్ల తర్వాత రామ్ గోపాల్ వర్మ తీసుకువస్తున్న సినిమా కావడంతో అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల మార్చి 21కి వాయిదా వేశారు.. మొత్తానికి వర్మ ఈ మూవీ పై కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ కాలేజీ ఈవెంట్ లో పాల్గొన్నాడు.
Also Read :షారుఖ్ కు షాకిచ్చిన యాడ్.. నోటీసులు జారీ..
పవన్ కళ్యాణ్ తో వర్మ సినిమా..?
రామ్ గోపాల్ వర్మ శారీ మూవీని జనాల్లో తీసుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. వరుస ఇంటర్వ్యూలు ప్రెస్ మీట్ లు ఇస్తూ సినిమాపై ఆసక్తిని పెంచేలా మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు ఇచ్చిన ఇంటర్వ్యూలు ఒక ఎత్తు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఇస్తున్న ఇంటర్వ్యూలు సినిమాపై భారీ హైప్ని తీసుకొస్తున్నాయి.. తాజాగా ఓ కాలేజీలో ఈవెంట్ కు హాజరైన వర్మ శారీ మూవీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా అక్కడున్న ప్రొఫెసర్లు పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తారా అని అడిగారు. దానికి రాంగోపాల్ వర్మ అమ్మ బాబోయ్ నేనైతే చేయను నేను చచ్చిన తర్వాత సినిమా వస్తాది ఏమో బేబీ నా దెయ్యాలు ఏమైనా సినిమా తీస్తే ఏమో చూడాలి అని అన్నాడు. ఆ తర్వాత చిరంజీవితో అయినా సినిమా చేస్తారని అడిగారు. నాకు ఇప్పట్లో అలాంటి ఆలోచనలు లేవు అని వర్మ సమాధానం ఇచ్చాడు. మొత్తానికి ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ వర్మ పై షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై వర్మ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..