Sharukh Khan : ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు పలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. స్టార్ రేంజ్ ఉన్న హీరోలు సినిమాలతో పాటు ఆడ్లను కూడా చేస్తూ ఉంటారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కూడా అనేక యాడ్లను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆయన చేస్తున్న వాటిలో పాన్ మసాలా యాడ్ కూడా ఒకటి.. ఈ యాడ్ అందరిని బాగా ఆకట్టుకుంది. ఇందులో ఒక్కరు కాదు ముగ్గురు హీరోలు నటించారు. అయితే ఆ యాడ్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు యాడ్ లో కనిపించిన ముగ్గురు పై ఫిర్యాధులు అందినట్లు తెలుస్తుంది. పాన్ మసాలా యాడ్ పై అభ్యంతరం ఎదురవ్వడంతో కొందరు ఫిర్యాదుల వల్ల కేసు నమోదు అయ్యింది. ఈ కేసు గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అనేక యాడ్స్ చేస్తుంటారు. అందులో ఒకటి విమన్ పాన్ మసాలా.. ఈ యాడ్ ద్వారా తప్పుదారి పట్టించే విధంగా ఉందని జైపూర్‌కు చెందిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లతో పాటు జెబి ఇండస్ట్రీస్ ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది.. ఈ ప్రొడక్ట్‌లోని ప్రతీ గింజలో కుంకుమ పువ్వు ఉందని ప్రకటన ఇవ్వడం ద్వారా తప్పుదారి పట్టిస్తున్నట్లు ఆరోపించింది. ఈ ఆందోళనల్ని పరిష్కరించడానికి వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా మార్చి 19న హాజరు కావాలని ఫోరం బాలీవుడ్ స్టార్స్ కు సమన్లు జారీ చేసింది..
Also Read : ఓరి నాయనో… సుమ అడ్డాకు అనుదీప్ మళ్లీ వచ్చిండ్రో…
ఈ ప్రోడక్ట్ లో నిజం లేదని కేవలం సేల్స్ కోసమే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ధరలో భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ, ప్రకటనలో సాఫ్రాన్ ఉందని సూచించడం ద్వారా తప్పుగా సూచిస్తున్నారని వాదిస్తూ జైపూర్ నివాసి యోగేంద్ర సింగ్ బడియాల్ ఫిర్యాదు చేశారు. దాంతో ఆ ప్రోడక్ట్ లో తప్పులు ఉన్నాయని చెబుతున్నారు. పలుకు పలుకుకి కుంకుమపువ్వు అని అందులో ట్యాగ్ ఇచ్చారు. కానీ నిజానికి కుంకుమపువ్వు కిలో ధర 4 లక్షల రూపాయలు ఉంది అలాంటి కుంకుమపువ్వుని ఎలా ఒక పాన్ మసాలాలో పెడతారని సదరు ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. ఇలా తప్పుడు ప్రకటనలు ఇచ్చి హీరోలా స్టార్ ఇమేజ్ ని తగ్గించుకుంటున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గైర్సిలాల్ మీనా అధ్యక్షతన సభ్యురాలు హేమలతా అగర్వాల్ నేతృత్వంలోని ఫోరం, ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని, నటులకు, కంపెనీ ఛైర్మన్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ ఫిర్యాదుతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. మరి దీని పై హీరోలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ముగ్గురు హీరోలకు మంచి డిమాండ్ ఉంది. స్టార్ రేంజ్ లో ఉన్న వీరంతా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.. షారుఖ్ ఖాన్ వయసుతో సంబంధం లేకుండా సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు.