BigTV English

Foreign investments: విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో భారత్ విఫలం.. షాకింగ్ రిపోర్ట్

Foreign investments: విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో భారత్ విఫలం.. షాకింగ్ రిపోర్ట్

Foreign investments: భారతదేశం ప్రస్తుతం విదేశీ పెట్టుబడుల పరంగా గడ్డు పరిస్థితుల్లో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ పతనం, దీనికి తోడు ఆర్థిక మందగమనం, లాభాలు తగ్గడం, అమెరికా సుంకాల వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. దీంతో ఆసియాలో పెట్టుబడుల కోసం చూస్తున్న వ్యాపారులు ఇప్పటికే చౌకైన దొరికే చైనీస్ వైపు ఆకర్షితులవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విదేశీ పెట్టుబడులు కనీస స్థాయికి పడిపోయాయి.


వ్యాపారులు ఇప్పటికే

భారతదేశం ప్రస్తుతం విదేశీ పెట్టుబడుల పరంగా గడ్డు పరిస్థితుల్లో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ పతనం, దీనికి తోడు ఆర్థిక మందగమనం, లాభాలు తగ్గడం, అమెరికా సుంకాల వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. దీంతో ఆసియాలో పెట్టుబడుల కోసం చూస్తున్న వ్యాపారులు ఇప్పటికే చౌకైన దొరికే చైనీస్ వైపు ఆకర్షితులవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విదేశీ పెట్టుబడులు కనీస స్థాయికి పడిపోయాయి.

తరలివెళ్లిన లక్షల కోట్ల రూపాయలు

ఓ కొత్త నివేదిక ప్రకారం 2023లో విదేశీ పెట్టుబడిదారులు భారత స్థానిక స్టాక్ మార్కెట్ నుంచి దాదాపు $15 బిలియన్లు (రూ. 13,07,23,87,50,000) ఉపసంహరించుకున్నారు. ఇది రికార్డ్ స్థాయికి చేరడానికి ముందే, గత సంవత్సరం 2022లో 17 బిలియన్ డారర్లు (రూ. 14,81,53,72,50,000) అవుట్‌ఫ్లో రూపంలో నమోదైంది. దీంతో ఈ అమ్మకాలు భారతదేశ మార్కెట్ విలువను 1.3 ట్రిలియన్ డాలర్లకు (రూ. 11,32,94,02,50,00,000) తగ్గించాయి. ఈ నివేదిక ప్రకారం చూస్తే భారత్‌లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం తగ్గిందని చెప్పవచ్చు. అంతేకాదు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా క్రమంగా తగ్గుతుందని నివేదిక స్పష్టం చేస్తోంది.


Read Also: Nirmala Sitharaman: గుడ్ న్యూస్.. జీఎస్టీ రేట్ల తగ్గింపుపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..

మందగమనానికి సమస్యలు ఇవేనా..

ఈ నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడుల ప్రవాహం తగ్గిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పలు అంతర్జాతీయ సవాళ్లు, ఆర్థిక మందగమనమే కాకుండా, లాభాలు తగ్గడం, అలాగే అమెరికా సుంకాల ప్రభావం వంటి అంశాలు ఈ పరిస్థితికి దారితీసే ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. ఈ క్రమంలో భారత మార్కెట్‌ విదేశీ పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా అనిపించట్లేదని అంటున్నారు. ఈ కారణంగా ఆసియాలో బేరసారాలు చేయడానికి చూస్తున్న వ్యాపారులు ఇప్పటికీ చైనా వంటి ఇతర దేశాల్లో చౌకగా లభించే వ్యాపారాలు, స్టాక్స్ వైపు మొగ్గుచూపుతున్నారని తెలిసింది. అలాగే, చైనాలో ప్రస్తుతం కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత టెక్నాలజీల ఆధిపత్యం ఉండటంతో అక్కడి మార్కెట్‌ బుల్ రన్‎లో కొనసాగుతోంది.

కనిష్ట స్థాయికి

భారతదేశ ఆర్థిక వ్యవస్థ కరోనాకు ముందు స్థాయి నుంచి పూర్తిగా తిరిగి రాన్నప్పటికీ, వృద్ధి మాత్రం తగ్గిపోయింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి అంచనాలు 6.5 శాతానికి పడిపోయాయని ఇటీవల ప్రభుత్వ డేటా ప్రకటించింది. ఇది గత నాలుగు సంవత్సరాలలో కనిష్ట స్థాయిగా చెప్పవచ్చు. ఆర్థిక వృద్ధి రేటు గత మూడు సంవత్సరాలలో 9 శాతం గరిష్టాన్ని నమోదు చేయగా, ఇప్పుడు దానికంటే చాలా తక్కువగా ఉంటుందని అంటున్నారు. ఈ పరిస్థితులు విదేశీ పెట్టుబడుల ప్రవాహం తగ్గడానికి దారితీస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు.

తగ్గుతున్న కంపెనీల లాభాలు

మరొక సమస్య ఆర్థిక మందగమనం, కార్పొరేట్ లాభాలు. JM ఫైనాన్షియల్ లిమిటెడ్ తెలిపిన ప్రకారం నిఫ్టీ 50 ఇండెక్స్‌లోని 60 శాతం కంటే ఎక్కువ కంపెనీలు తమ ముందస్తు లాభాల అంచనాలను తగ్గించుకున్నాయి. బ్లూమ్‌బెర్గ్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం భారతదేశ ఆదాయ సవరణ వేగం ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కంటే అత్యంత బలహీనంగా ఉందని తెలుపడం.

తగ్గిన కంపెనీల సేల్స్

ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీల అమ్మకాలు కూడా తగ్గాయి. గత ఎనిమిది త్రైమాసికాలలో సగటున రూ. 11,430 కోట్లు విక్రయించినప్పటికీ, తాజా త్రైమాసికంలో ఈ అమ్మకాలు రూ. 490 కోట్లు మాత్రమే ఉన్నాయని నువామా వెల్త్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ డేటా సూచిస్తుంది. ఈ ప్రవర్తన కూడా మార్కెట్‌పై ఒత్తిడి తగ్గడానికి కారణమని చెప్పవచ్చు.

అమెరికా సుంకాలు

భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలపై సుంకాలు కీలక ప్రభావం చూపించనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పరస్పర సుంకాల విధానం ద్వారా భారతదేశంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ పరిణామం అమెరికా కంటే భారతదేశానికి ఎక్కువ నష్టం కలిగిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. దీని ద్వారా విదేశీ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. మొత్తం మీద భారతదేశం విదేశీ పెట్టుబడుల పట్ల తన ప్రాధాన్యతను నిలబెట్టుకునేందుకు ఆర్థిక పునరుద్ధరణ, కార్పొరేట్ లాభాలు పెరగడం, వినియోగదారుల వ్యయం పెరగడం వంటి అనేక అంశాలపై ఫోకస్ చేయాల్సిన అవసరముందని నిపుణులు భావిస్తున్నారు.

Related News

Digital Rent Agreement: ఈ రూల్ తెలియకుండా ఇల్లు అద్దెకు ఇస్తే రూ. 5000 జరిమానా కట్టక తప్పదు..

Real Estate: ఈ విషయాలు తెలియకుండా ‌ఫార్మ్ లాండ్స్ కొంటే భారీ నష్టం తప్పుదు..అడ్వర్టయిజ్‌మెంట్స్ చూసి మోసపోకండి..

Gold Particles: మురుగునీటి నుంచి భారీగా బంగారం ఉత్పత్తి.. లక్షల్లో సంపాదన..? ఎక్కడో తెలుసా?

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Big Stories

×