E-Paper
Advertisement

Vyuham Release Date : కుట్రలకీ, ఆలోచనలకీ మధ్య “వ్యూహం”

Vyuham Release Date : కుట్రలకీ, ఆలోచనలకీ మధ్య “వ్యూహం”
Advertisement

Vyuham Release Date : కాంట్రవర్శీలతో కూడిన సినిమాలు తీయడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందుటారు. గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మరాజ్యంలో కడపబిడ్డలు, మర్డర్ వంటి సినిమాలతో సంచలనం సృష్టించిన ఆర్జీవీ.. ఇప్పుడు వైఎస్సార్ మరణం తర్వాత.. జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్, దాని తర్వాత జగన్ సీఎం ఎలా అయ్యాడన్న పాయింట్ లో వ్యూహం సినిమాను తెరకెక్కించారు ఆర్జీవీ.

తాజాగా ఈ సినిమా నుంచి కీలక అప్‌డేట్ ఇచ్చారు ఆర్జీవీ. వ్యూహం మూవీ రెండు పార్ట్‌లుగా రిలీజ్‌ కానున్నట్టు ఆయన తెలిపారు. రెండు నెలల గ్యాప్‌తో ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఫస్ట్‌ పార్ట్‌ నవంబర్‌ 10న, రెండో పార్ట్‌.. వచ్చే ఏడాది జనవరి 25న థియేటర్లలోకి రానున్నాయి. ఫస్ట్‌ పార్ట్‌ వ్యూహంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. సెకండ్ పార్ట్‌కు శపథం అనే టైటిల్‌ ను ఖరారు చేశారు.

Advertisement

మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చనిపోయిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు ఆర్జీవీ. వైఎస్‌ జగన్‌ పాత్రలో అజ్మల్‌ అమీర్‌ నటిస్తున్నారు. ఇప్పటికే వ్యూహం టీజర్‌ను రిలీజ్‌ చేశారు ఆర్జీవీ. రానున్న రోజుల్లో శపథం టీజర్‌ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఏపీలో వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల లోపే వ్యూహం, శపథం సినిమాలు విడుదలువుతుండటం విశేషం. సరిగ్గా ఎన్నికలకు రెండు నెలల ముందు శపథం సినిమా విడుదలవుతుంది. మరి వీటి ఎఫెక్ట్ ఏపీ ఎన్నికలపై ఉంటాయా ? అని ప్రజలు ఇప్పటి నుంచే చర్చించుకుంటున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×