BigTV English

Rithu Chowdary:హైపర్ ఆది చేసిన ఆ పనివల్లే జబర్దస్త్ వదులుకున్నా: రీతూ చౌదరి

Rithu Chowdary:హైపర్ ఆది చేసిన ఆ పనివల్లే జబర్దస్త్ వదులుకున్నా: రీతూ చౌదరి

Rithu Chowdary coments on Hyper Adi about popular tv comedy show Jabardast
బుల్లితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న పాపులర్ షో జబర్తస్త్ ఎంతగా పాపులర్ అయిందో అందరికీ తెలుసు. కామెడీ షోగా అనేక మంది నటీనటులకు జబర్దస్త్ వేదికగా మారింది. జబర్దస్త్ లో నటిస్తే చాలు పాపులర్ అయిపోతామని చాలా మంది ఇప్పటికే నిరూపించారు. వీళ్లకు సినిమాలలో ఛాన్స్ కూడా చాలా తొందరగా వస్తోంది. ఇక హైపర్ ఆది గురించి పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ షో అది రాకముందు, వచ్చాక అనే కంపేర్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఆ షోకి అంతలా పేరు తెచ్చిపెట్టారు హైపర్ ఆది. ఆయన వేసే డైలాగుల పంచ్ లు మనం నవ్వే లోగా వేరే పంచ్ పడిపోతుంటుంది. అంతలా డైలాగ్స్ డైనమైట్ లా ఆది క్రేజ్ సంపాదించుకున్నాడు.


ఆదితో లవ్ ఎఫైర్

ప్రస్తుతం అటు సినిమాలలోనూ నటిస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నాడు. కొన్నిసార్లు ఆది శృతి మంచిన డైలాగులతో వివాదాస్పదాలు కూడా కోరితెచ్చుకున్నారు. అయితే ఆది కొంతకాలంగా జబర్దస్త్ స్కిట్స్ చేయడం మానేశాడు. బయట అవకాశాలు ఎక్కువగా రావడంతో రెండింటికీ న్యాయం చేయలేనని భావించినట్లు ఉన్నాడు. అయితే ఆది తర్వాత ఆ స్థానాన్ని వేరెవరూ భర్తీ చేయలేకపోతున్నారు. ఇదెలా ఉంటే జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయింది రీతూ చౌదరి. ఆది టీమ్ లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. జబర్దస్త్ కామెడీ షోకి రాకముందు రీతూ పలు టీవీ సీరియల్స్ లో నటించింది. కొన్ని సినిమాలలో సైడ్ క్యారెక్టర్లు కూడా చేసింది. టీవీ సీరియల్స్ , సినిమాలు చేసినా రాని పేరు జబర్దస్త్ చేయడంతో రీతూ పేరు మార్మోగిపోయింది. ఆది రీతూ మీద వేసే పంచ్ లతో అసలు వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా అనే స్థాయికి చేరుకుంది. అయితే అది నిజం కాదని కొంతకాలానికి ప్రేక్షకులు అర్థమైపోయింది. వీళ్లు కేవలం ఆన్ స్క్రీన్ జంట మాత్రమే అని స్పష్టం అయింది.


టించబుద్ది కావడం లేదు

రీతూ ప్రస్తుతానికి జబర్దస్త్ కామెడీ స్కిట్లకు దూరంగా ఉంటోంది. బయట ఏదో రియాలిటీ షోలు మాత్రమే చేసుకుంటోంది. ఇటీవల మీడియా సమావేశంలో అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ తాను ఎందుకు జబర్దస్త్ చేయడం లేదో స్పష్టం చేసింది. ఎవరి ద్వారా నేను జబర్దస్త్ షోకి పరిచయం కాబడ్డానో ఆ వ్యక్తి ద్వారా నాకు మంచి గుర్తింపు లభించింది. ఎక్కడికి వెళ్లినా నన్ను గుర్తుపట్టడానికి జబర్దస్త్ కామెడీ స్కిట్లే కారణం. ఆ స్కిట్లు అంతగా పాపులర్ అవ్వడానికి దాని వెనక డైలాగులు రాసిన ఆదికే ఆ క్రెడిట్ అంతా దక్కుతుందని అన్నారు రీతూ. ఎప్పుడైతే ఆది జబర్దస్త్ షో నుంచి తప్పుకున్నారో అప్పటినుంచి నేను కూడా బయటకు వచ్చేయాలని అనుకున్నాను. మళ్లీ ఆది తర్వాత ఏ ఒక్కరి స్కిట్ లో నాకు నటించబుద్ది కాలేదు అంటున్నారు రీతూ.

బోల్డ్ క్యారెక్టర్లకు నో..

తనకి ఇప్పుడు పరిస్థితి బాగానే ఉందంటూ..చాలా ఆఫర్లే వస్తున్నాయి. కెరీర్ ను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుతేస్తున్నానంటున్నారు రీతూ. సినిమాలలో ఐటం సాంగ్స్ చేయాలని..బోల్డ్ క్యారెక్టర్లు చేయాలని ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అడుగుతున్నారని..అలాంటివి ఇష్టం లేకే అవకాశాలు వస్తున్నా వాటిని వదులుకుంటున్నానంటున్నారు రీతూ.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×