R.K. Sagar: ప్రస్తుత కాలంలో చాలా మంది దర్శకులు తమకు తాముగా స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తుండగా.. ఇలాంటి క్రమంలోనే సీరియల్స్ నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో రాజమౌళి (Rajamouli)కూడా ఒకరు. ఒకప్పుడు ‘శాంతి నివాసం’ అనే సీరియల్ చేసి, దర్శకుడిగా అక్కడ సక్సెస్ అయ్యాక, ఇక్కడ తన ప్రతిభను చూపించుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే పాన్ వరల్డ్ డైరెక్టర్ గా ఎదిగి అందరిని ఆశ్చర్యపరిచారు. అంతేకాదు తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించి తెలుగు సినిమా పరిశ్రమ ఎదుగుదలకు మూల స్తంభంగా నిలిచారు.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పై ఆర్కే సాగర్ కామెంట్స్..
ఇదిలా ఉండగా ఒకప్పుడు ‘మొగలిరేకులు’ సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటుడు ఆర్.కే.సాగర్ (R.K.Sagar). ఈ సీరియల్ తో ఒక స్టార్ హీరోకి వచ్చినంత ఇమేజ్ ఆయనకు లభించింది. ఎంతోమంది దర్శకులు ఈయనతో సినిమాలు చేయడానికి ప్లాన్ కూడా చేశారు. ఈ క్రమంలోనే రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా వచ్చిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనే సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఉండటంతో ఆ సినిమా దర్శకుడు దశరథ్(Dasharath).. ఆర్కే సాగర్ ను అప్రోచ్ అయినట్లు సమాచారం. అయితే ఆ క్యారెక్టర్ ని సాగర్ చేయనని చెప్పారట. దాంతో ఆ క్యారెక్టర్ కోసం వేరే నటుడిని చూస్తున్న సమయంలోనే, ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న బాబీ (Bobby ) సాగర్ దగ్గరకు వచ్చి, ఈ క్యారెక్టర్ రాజు సుందరం కోసం డిజైన్ చేసిన క్యారెక్టర్, ఆ పాత్ర చేస్తే నీకు మంచి గుర్తింపు వస్తుంది అంటూ కొన్ని మాటలు చెప్పారట. దీంతో అతడి మాటలు నమ్మిన సాగర్ ఈ సినిమా ఒప్పుకొని ఆ పాత్ర చేశాడు. అయితే సినిమాలో చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ బాగా ఇంపాక్ట్ అనిపించింది, కానీ విడుదలైన తర్వాత ఎవరు కూడా ఆయనను గుర్తించకపోవడంతో భారీ మైనస్ అయిందని చెప్పాలి. ఇలా కెరీర్ కు మైనస్ అవడానికి కారణం బాబీ అంటూ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాగర్ తెలిపారు.
డైరెక్టర్ బాబీ వల్లే నా కెరియర్ నాశనం..
సాగర్ మాట్లాడుతూ.. “డైరెక్టర్ బాబీ వల్లే నేను ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాలో నటించాల్సి వచ్చింది. దానివల్ల నాకు ఎటువంటి ప్రయోజనం కలగలేదు. చాలా వరకు నా కెరియర్ కు డామేజ్ కలిగింది” అంటూ తెలిపారు సాగర్. మొత్తానికైతే వీళ్ళ వల్లే సాగర్ కెరీర్ ఎటూ కాకుండా పోయిందని చెప్పవచ్చు.. ఇక అటు సీరియల్స్ చేయలేక.. ఇటు సినిమాలు చేయలేక ప్రస్తుతం జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కనీసం ఇకనైనా రాజకీయాలలో బిజీ కావాలని అభిమానులు కోరుతున్నారు. మరి సాగర్ ఇకనైనా ఆచితూచి అడుగులు వేసి కెరీర్ కు పునాదులు వేసుకోవాలని కూడా కోరుతూ ఉండడం గమనార్హం. అందుకే అంటారు తమకు నచ్చిన క్యారెక్టర్ లోనే చేయాలి అని, ఒకరి బలవంతం వల్ల క్యారెక్టర్లు చేస్తే ఇలాగే కెరియర్ కి డామేజ్ ఏర్పడుతుందని నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.