Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఎట్టకేలకు తన లుక్ మార్చారు. గత ఐదేళ్ల నుంచి జులపాల జుట్టుతో, గుబురు గడ్డంతో పుష్ప రాజ్ లుక్ లో కనిపించిన అల్లు అర్జున్… తాజాగా కొత్త లుక్ లో దర్శనమిచ్చారు. నాంపల్లి కోర్టులో ఆయన కొత్త లుక్ లో కనిపించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ (Allu Arjun) తాజాగా నాంపల్లి కోర్టుకు వెళ్లారు. కోర్టులో బెయిల్ పూచీకత్తు, దానికి సంబంధించిన పత్రాలను జడ్జ్ ముందు సమర్పించడానికి స్వయంగా బన్నీ కోర్టుకు వెళ్లారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసులో ఆయనకు నిన్న రెగ్యులర్ బెయిల్ దొరికిన సంగతి తెలిసిందే. రూ. 50,000 చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశిస్తూ, సాక్షులను ప్రభావితం చేయొద్దని, కేసును ప్రభావితం చేసేలా కామెంట్స్ చేయొద్దని షరతులు కోర్టు విధించింది. ప్రతి ఆదివారం రెండు నెలల పాటు చిక్కడపల్లి పోలీసులు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు బన్నీని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆయన తాజాగా నాంపల్లి కోర్టుకు వెళ్లారు. ఆ టైమ్ లఓ పుష్ప లుక్ ను మార్చేసి కన్పించారు.
‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ కోసం అల్లు అర్జున్ కేవలం సమయాన్ని మాత్రమే కాదు, తన పర్సనల్ లైఫ్ ని కూడా దాదాపు ఐదేళ్లు పక్కన పెట్టారని చెప్పాలి. అల్లు అర్జున్ 5 ఏళ్ల నుంచి ఈ సినిమా కోసం గడ్డాన్ని తీయకుండా ఎంత డెడికేట్ గా వర్క్ చేశారో అందరికీ తెలుసు. మొత్తానికి ఈ సినిమాతో అల్లు అర్జున్ గ్లోబల్ స్థాయిలో మరింత గుర్తింపును, పాపులారిటీని దక్కించుకున్నారు. ఇప్పటిదాకా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్క హీరో కూడా అందుకోలేని నేషనల్ అవార్డుని సొంతం చేసుకొని చరిత్రను సృష్టించారు.
ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ‘పుష్ప 2’ మూవీతో బాక్స్ ఆఫీసు వద్ద ‘బాహుబలి’ క్రియేట్ చేసిన కంచుకోటని బద్దలు కొట్టింది. కేవలం కమర్షియల్ సినిమాతోనే కోట్ల రూపాయలు కొల్లగొట్టి ప్రభంజనం సృష్టించింది. వివాదాలు కూడా అదే రేంజ్ లో వచ్చాయనుకోండి.
అయితే ఇప్పటిదాకా ‘పుష్ప 2’ కోసం అల్లు అర్జున్ (Allu Arjun) జుట్టును, గడ్డాన్ని పొడవుగా పెంచిన లుక్ లోనే కనిపించారు. కానీ తాజాగా ఇప్పుడు ఆ బియర్డ్ కు బైబై చెప్పేశారు. తాజా లుక్ లఓ అల్లు అర్జున్ బియర్డ్, హెయిర్ ని ట్రిమ్ చేసి, నీట్ లుక్ లో కోర్టు దగ్గర దర్శనం ఇచ్చారు. అంతేకాకుండా అల్లు అర్జున్ అతి త్వరలోనే క్లీన్ షేవ్లో కనిపించనున్నట్టుగా తెలుస్తోంది.
ఇక తన గారాలపట్టి అర్హ ఈ లుక్ వల్ల తనను దూరం పెట్టేసిందని, దగ్గరికి రానివ్వడమే మానేసిందని బన్నీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడు ఈ లుక్ నుంచి బయటపడి, తన బిడ్డను ప్రేమగా ముద్దు పెట్టుకుంటానా అని ఎదురు చూస్తున్నట్టు బన్నీ (Allu Arjun) ‘పుష్ప 2’ ప్రమోషన్స్ లో వెల్లడించారు. ఎట్టకేలకు ఈ లుక్ కి వీడ్కోలు పలికారు.
నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ https://t.co/NMiRhsTCrd pic.twitter.com/p0ClVL0wCo
— BIG TV Breaking News (@bigtvtelugu) January 4, 2025