BigTV English
Advertisement

Robinhood: అందరినీ తిట్టే గ్రోక్ ని ఇలా వాడేస్తున్నారు… కానివ్వండి సార్ కానివ్వండి

Robinhood: అందరినీ తిట్టే గ్రోక్ ని ఇలా వాడేస్తున్నారు… కానివ్వండి సార్ కానివ్వండి

Robinhood: ఏఐ చాట్ బాట్ గ్రోక్… X లోకి ఎంటర్ అయిన ప్రతి ఒక్కరికీ చుక్కలు చూపిస్తోంది. తెలుగు వాడుక భాషలో రిప్లై ఇస్తూ, పచ్చి భూతులు తిడుతూ అందరినీ ఒక ఆట ఆడేసుకుంటుంది గ్రోక్. సినీ అభిమానుల ఫ్యాన్ వార్స్ లో కూడా దూరిపోయి అందరినీ తిడుతున్న గ్రోక్, గత కొన్ని రోజులుగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. మీమ్ మెటీరియల్స్ సాలిడ్ గా ఇస్తున్న గ్రోక్ పవన్ కళ్యాణ్-మహేష్ బాబు అభిమానుల ఫ్యాన్ వార్ లో దూరి రచ్చ రచ్చ చేసింది. బాక్సాఫీస్ రికార్డులు, స్టార్ హీరో ఫ్యాన్ బేస్ ఎంత? ఎవరు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్ లాంటి ప్రశ్నలకి కూడా సూపర్ ఆన్సర్ ఇస్తుంది గ్రోక్.


సింపుల్ గా చెప్పాలి అంటే గ్రోక్ తో తిట్టించుకోని తెలుగు యువత లేడు. ఆ రేంజ్ రచ్చ చేస్తున్న గ్రోక్ ని సూపర్ గా వాడేస్తున్నారు రాబిన్ హుడ్ టీమ్. గ్రోక్ ని ప్రమోషన్స్ కి కూడా వాడుకోవచ్చు అని నిరూపిస్తూ బ్యాక్ టు బ్యాక్ ట్వీట్స్ వేస్తున్నారు. రాబిన్ హుడ్ ట్రైలర్ డేట్ ని లాక్ చేసిన గ్రోక్, అసలు టాలీవుడ్ కి 9 సెంటిమెంట్ ఏంటో? చెప్పిన టైమ్ ఎలాగూ రిలీజ్ చేయరు కదా అని పంచులు వేస్తూ… మార్చ్ 21 సాయంత్రం 4:05 నిమిషాలకి ట్రైలర్ లాంచ్ టైమ్ ఫిక్స్ చేసింది గ్రోక్.

రాబిన్ హుడ్ ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్ చేసిన గ్రోక్ ని మళ్లీ గెలకాలి అనిపిస్తుంది అంటూ డైరెక్టర్ వెంకీ కుడుముల ట్వీట్ చేయడంతో… హీరో నితిన్ “గెలకాలి అనిపిస్తే గోర్లు కట్ చేసుకో కానీ గ్రోక్ తో కామెడీ చేయకు” అంటూ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన మూవీ లవర్స్ గ్రోక్ ని ఇలా కూడా వాడేస్తున్నారు, కానివ్వండి సార్ కానివ్వండి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రాబిన్ హుడ్ ప్రమోషన్స్ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆన్లైన్-ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా నితిన్, వెంకీ కుడుముల రాబిన్ హుడ్ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు.


ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ మార్చ్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. మరి థియేటర్స్ లో రాబిన్ హుడ్ సినిమా ఎంతవరకూ ఆడియన్స్ ని మెప్పిస్తుంది? నితిన్ ని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే రాబిన్ హుడ్ సినిమాపైన పాజిటివ్ బజ్ ఉంది కాబట్టి ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ. ఆ తర్వాత మౌత్ టాక్ ని బట్టి రాబిన్ హుడ్ రిజల్ట్ ఆధారపడి ఉంది..

Tags

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×