IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 18వ సీజన్ కి మరో నాలుగు రోజులలో తెరలేవనుంది. మార్చి 22న ఐపీఎల్ 2025 గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్ లో డిపెండింగ్ ఛాంపియన్ కలకత్తా నైట్ రైడర్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కి వేదిక కానుంది. ఈ 18వ సీజన్ మొత్తం 13 వేదికలలో నిర్వహించనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ కూడా ఒకటి.
Also Read: IPL 2025: ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీ.. రంగంలోకి తోపు హీరోయిన్లు?
ఈ ఏడాది విశాఖ వేదికగా జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ ల కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటికే విశాఖ చేరుకుంది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్ట్ కి తరలివచ్చారు. ఏసీఏ – వీడిఏసి అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఈ నెల 24న ఢిల్లీ క్యాపిటల్స్ – లక్నో జెయింట్స్, 30వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్-సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ లు జరగనున్నాయి.
ఇందుకు అనుగుణంగా మైదానంలో నూతన సదుపాయాలను కూడా సమకూర్చారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆపరేషన్ టీమ్ సభ్యులు డాక్టర్ వైఎస్ఆర్ ఏసిఏ – ఏడీసీఎల్ స్టేడియాలను సందర్శించారు. అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమయ్యారు. ఐతే అన్ని జట్లు తమ హోమ్ గ్రౌండ్స్ లో ఆడుతుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రమే విశాఖపట్నంలో కూడా ఆడనుండడంపై దేశవ్యాప్తంగా చర్చ సాగింది.
కాగా ఢిల్లీ క్యాపిటల్స్ కి రెండు హోం స్టేడియాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ఢిల్లీ, మరొకటి విశాఖపట్నం. ఎందుకంటే ఢిల్లీ జట్టు యాజమాన్యంలో విశాఖకు సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నాడు. అతను కూడా ఢిల్లీ జట్టును నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి రెండు హోం స్టేడియాలు ఉన్నాయి. ఐతే విశాఖలోని పీఎం పాలెం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మ్యాచ్ లు ఆడబోతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ – లక్నో జట్ల మధ్య జరిగే మ్యాచ్ టికెట్ల విక్రయాలను శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేశారు.
Also Read: Ms Dhoni: వాళ్ల బౌలింగ్ లో బ్యాటింగ్ చేయలేను.. ధోని షాకింగ్ కామెంట్స్
కానీ ఈ మ్యాచ్ లకు జనాధారణ కరువైంది. ఆన్లైన్ లో ఆశించినంత స్థాయిలో టికెట్లు అమ్ముడుపోవడం లేదు. అయితే విశాఖలో జరిగే మ్యాచ్లకు సంబంధించి సరైన ప్రచారం లేకపోవడం, నిర్వహణ లోపంతోనే టికెట్లు అమ్ముడుపోవడం లేదని అంటున్నాయి క్రీడ వర్గాలు. ఆన్లైన్ లో టికెట్లు విడుదల చేసి నాలుగు రోజులు గడుస్తున్నా.. టికెట్లను కొనుగోలు చేసేందుకు క్రీడాభిమానులు ఆసక్తి చూపించడం లేదు. మరోవైపు టికెట్లు విడుదల చేసిన కొద్ది నిమిషాలలోనే రూ. 1000 టికెట్లు ఖాళీ అయిపోయాయని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చవక ధర టికెట్లు అందుబాటులో లేకపోవడం, అధిక ధరల టికెట్లపై అభిమానులు ఆసక్తి చూపించకపోవడంతో ఈ విషయం నిర్వాహకులకు తలనొప్పిగా మారింది.