BigTV English

Roja Movie: ఈ హీరో జీవితంలో ఇంత విషాదమా.. కన్నీరు పెట్టిస్తున్న స్టోరీ..!

Roja Movie: ఈ హీరో జీవితంలో ఇంత విషాదమా.. కన్నీరు పెట్టిస్తున్న స్టోరీ..!

Roja Movie.. మణిరత్నం (Maniratnam) దర్శకత్వంలో మధుబాల (Madhubala) హీరోయిన్ గా అరవింద్ స్వామి (Aravindh swamy)హీరోగా తెరకెక్కిన చిత్రం రోజా. ఈ సినిమా అప్పట్లోనే కాదు ఇప్పటికీ ఎవర్గ్రీన్. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ కూడా శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. అంత పాపులారిటీ సొంతం చేసుకుంది ఈ చిత్రం. ఇకపోతే అరవింద్ స్వామి. ఒకప్పుడు హీరోగా మంచి పాపులారిటీ సొంతం చేసుకొని ఆ తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి సడన్ గా దూరం అయిపోయారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ ను రామ్ చరణ్ (Ram Charan) హీరోగా నటించిన ధ్రువ సినిమాతో విలన్ గా మొదలుపెట్టి ఆకట్టుకున్నారు. ఇక అప్పటినుంచి భిన్న విభిన్నమైన పాత్రలు చేస్తూ ఆడియన్స్ ను అలరించే ప్రయత్నం చేస్తున్నారు అరవింద్ స్వామి. ఈ క్రమంలోనే తాజాగా కార్తీ హీరోగా నటించిన సత్యం సుందరం సినిమాలో కార్తీ తన అద్భుతమైన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.


13 ఏళ్లలో కేవలం 2 సినిమాలే..

ఇకపోతే సత్యం పాత్రలో అరవిందస్వామి విపరీతంగా ఆకట్టుకున్నారు. ఈ పాత్రలో తాను ఇన్వాల్వ్ చేసినట్టు అనిపించిందని తాజాగా సినిమా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చారు. అంతేకాదు తన కెరియర్ లో వచ్చిన లాంగ్ గ్యాప్ గురించి కూడా చెప్పుకొచ్చారు అరవింద్ స్వామి. రోజా, బొంబాయి సినిమాలతో సూపర్ హిట్ అందుకొని, కలల రాకుమారుడిగా పేరు సొంతం చేసుకున్న ఈయన 2000 నుంచి 2013 వరకు కేవలం రెండు సినిమాలనే చేశారు. 2013లో తని ఒరువన్ సినిమాతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో  విలన్ గా కొత్త టర్న్ తీసుకున్నారు. అప్పటి నుంచి వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు.


పక్షవాతం వచ్చింది.. అందుకే లాంగ్ గ్యాప్..

అయితే ఆ సమయంలో లాంగ్ గ్యాప్ తీసుకోవడానికి గల కారణాన్ని ఆయన చెప్పుకొచ్చారు. తీవ్రమైన వెన్ను నొప్పితో పాటు కాలికి పక్షవాతం వచ్చిందని , దానివల్లే సినిమాలకు దూరంగా ఉన్నానని తెలిపారు. ఇకపోతే అరవింద్ స్వామికి పక్షవాతం అనగానే ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు. అయితే ఇదంతా ఒకప్పుడు అని ప్రస్తుతం అంతా సెట్ అయిందని తెలిపారు. ఇకపోతే రీ ఎంట్రీ లో కేవలం ఒక రకమైన పాత్రలకే పరిమితం కాకుండా వెరైటీ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

రామ్ చరణ్ వల్లే తెలుగు సినిమా చేశా..

ఇకపోతే తెలుగులో రామ్ చరణ్ తో కలిసి ధ్రువ సినిమాతో రీయంట్రి ఇచ్చారు అరవింద్ స్వామి. తని ఒరువన్ రీమేక్ అవ్వడమే కాకుండా రామ్ చరణ్ వల్లే ఆ సినిమా చేశానని, ఆ సినిమా సమయంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఆ తర్వాత ఎన్ని తెలుగు సినిమాలలో ఆఫర్లు వచ్చినా ఆయన చేయలేదు. ఇక ఇప్పుడు సత్యం సుందరం సినిమాతో తెలుగు ఆడియన్స్ ను అలరించిన ఈయన ఇప్పటికైనా తెలుగు ఆఫర్లకు ఓకే చేస్తారా? లేదా ?అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం అన్నీ పాన్ ఇండియా చిత్రాలే వస్తున్నాయి కాబట్టి కచ్చితంగా ఒక మంచి రోల్ ఇస్తే మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకుంటారు అంటూ అరవింద్ స్వామి అభిమానులు కోరుతున్నారు.

Related News

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Big Stories

×