BigTV English

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Ruksana Bano: ప్రముఖ సింగర్ మృతి.. షాకింగ్‌లో ఫ్యాన్స్.. విషం ఇచ్చి హత్య!

Odisha Singer’s Mysterious Death Shocks Fans: సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ఒడిశాలోని సంబల్‌పూర్‌కి చెందిన ప్రముఖ లేడీ సింగర్ రుక్సానా బానో మృతి చెందారు. అయితే సింగర్ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కావాలనే ఎవరో విషం ఇచ్చి చంపేందుకు కుట్ర చేశారని సింగర్ తల్లి ఆరోపించింది. అయితే రుక్సానా 27 ఏళ్లకే చనిపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.


వివరాల ప్రకారం.. ప్రముఖ లేడీ సింగర్ రుక్సానా బానో(27) ఆల్బమ్ సాంగ్స్ పాడుతూ గుర్తింపు తెచ్చుకుంది. ఒడియా పాటలు పాడుతూ ఫేమస్‌గా గుర్తింపు తెచ్చుకున్న రుక్సానా.. కొన్నాళ్ల క్రితం షూటింగ్ కోసమని బోలంగిర్ అనే గ్రామానికి వెళ్లింది. అక్కడ షూటింగ్ జరుగుతున్న సమయంలో అనారోగ్యానికి గురైంది. అయితే ఆమె షూటింగ్ సమయంలో ఓ జ్యూస్ మాత్రమే తాగానని, ఆ జ్యూస్ తాగిన తర్వాతే అనారోగ్యానికి గురైనట్లు వాపోయింది.

దీంతో ఆమె అనారోగ్యం చెందడంతో తొలుత భవానీపట్నంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం బార్గర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా నయం కాకపోవడంతో భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో రాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆమె అనారోగ్యంపై వైద్యులు సరైన వివరణ ఇవ్వలేదు. కానీ రుక్సానా ‘స్క్రబ్ టైఫస్’ అనే వ్యాధితో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు.


Also Read: ఇక బాలీవుడ్ ఖాళీ… టాలీవుడ్‌పై కన్నెసిన జాన్వీ బెస్ట్ ఫ్రెండ్..

ఇదిలా ఉండగా, ఈ ‘స్క్రబ్ టైఫస్’ అనే వ్యాధి ఏదైనా క్రిమి సంహారక పురుగు లేదా విషపురుగు కాటు వేస్తే సోకుతుందని అంటున్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటాయన్నారు. అయితే రుక్సనా తల్లితోపాటు ఆమె సోదరి ప్రత్యర్థి సింగర్ విషమిచ్చి చంపేసిందని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఒడిశా సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతోంది.

రుక్సానా 27 ఏళ్లకే చనిపోవడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. గతంలోనే రుక్సానాకు కొంతమంది బెదిరించారని అంటున్నారు. రుక్సానా.. మెహ్కేగా దిల్ కా అంగన్, పర్దేస్ మే హై సజాన్, తేరీ ఆంఖో మే హై జాదు వంటి పాటలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే కెరీర్ పరంగా సక్సెస్ అవుతున్న తరుణంలో కొంతమంది ప్రత్యర్థులు ఇబ్బందులకు గురిచేశారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రుక్సానాకు కొంతకాలంగా ప్రత్యర్థులు నుంచి బెదిరింపులు వచ్చాయని ఆమె తల్లితోపాటు సోదరి ఆరోపణలు చేశారు. అయితే ఆ వ్యక్తులు ఎవరనే విషయం బయటకు చెప్పకపోవడం గమనార్హం.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×